వరంగల్

ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, జూలై 30: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో విద్యావవస్థను తీర్చిదిద్దడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో సోమవారం గ్రాడ్యూయేట్స్ అసోసియేషన్ సభ్యు లు వేముల శ్రీనివాస్, పల్ల ప్రమోద్‌రెడ్డి, అయిత కిషన్‌ప్రసాద్, కోడూరి సుగుణాకర్, వంగ రవి, తాళ్ల వీరేశం, ఎదులాపురం తిరుపతి, ముల్ల శ్రీనివా స్, సుద్దాల సంపత్‌ల ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకున్న ప్రజాగ్రంథాలయం ప్రారంభోత్సవం, చేపల మా ర్కెట్, నూతనంగా నిర్మించిన నాలుగు గదులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ అమ్రాపాలి, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, శాసన మండలి సభ్యులు సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావులు ప్రారంభోత్సవం చేశారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ముల్కనూర్ గ్రంథాలయంకు రూ.15 లక్షల రూపాయలు వెంటనే సమకూర్చడం జరుగుతుందన్నారు. విద్యార్ధులు మొబైల్ పక్కకు పెట్టి కనీ సం రోజుకు 30 నిమిషాల పాటు పుస్తక పఠనం చేయాలన్నారు. గత రెం డు సంవత్సరాలుగా ప్రజలు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందన్నా రు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీరాంతరావు మాట్లాడుతూ ప్రజాగ్రంథా లయంకు తనవంతుగా రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాగ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీ గా మార్చుతామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అమ్రాపాలి మాట్లాడుతూ ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం పనితీరు భవన నిర్మాణం పనిని చూసే తనకు వారి అంకిత భావం తెల్సిందన్నారు. కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ వేముల శ్రీనివాస్, బ్యాంకు అధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, కావేరి సీడ్స్ అధినేత గుండవరపు భాస్కర్‌రావు, జిల్లా గ్రంథాలయం నిర్వహకులు అయాతం శ్రీ్ధర్, అజీజ్‌ఖాన్, ఎంపీపీ సంగ సంపత్, జడ్పీటీసీ రాంచందర్‌నాయక్, టి ఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వంగ రవిందర్‌గౌడ్, రావుల శశిధర్, డాక్టర్ సుధీర్‌కుమార్, మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ నవాబ్‌పాషా, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సయ్యద్ శరీఫోద్దిన్, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి తో పాటు విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నూరు శాతం మరుగుదొడ్లు పూర్తయిన గ్రామాల వివరాలివ్వండి
* అధికారులను ఆదేశించిన కలెక్టర్ అమయ్‌కుమార్

వరంగల్, జూలై 30: జిల్లాలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూరె్తైన గ్రామాల వివరాల ను అందించాలని భూపాలపల్లి కలెక్టర్ అమయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ములుగు ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతోమరుగుదొడ్ల నిర్మాణంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ నాటికి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా లక్ష్యం చేరాడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా ఎంపీడీవోలు, ఇజిఎస్, ఎపీవోలు గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలో ఈనెల 31 వరకు 32 గ్రామాలను ఓడిఎఫ్‌గా చేయ్యాలని నిర్ణయించినందున, ఆయా గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేసి, ఆగస్టు 10వరకు రిపోర్ట్ అందించాలని కోరారు. జిల్లాలో పారిశుద్ద కార్యక్రమాలను పరిశీలించి ర్యాంకింగ్ ఇవ్వడానికి రాష్టస్ధ్రాయి నుండి స్వచ్ఛ సర్వేక్షన్ అధికారుల బృందం ఆగష్టు ఒకటవ తేదీనుండి 30వరకు పర్యటిస్తారని అన్నారు. వారికి ఎంపీడీవోలు, ఇజిఎస్ ఎపీవోలు దగ్గరుండి తగు సమాచారం అందించాలని కోరారు. నిర్మాణం పురె్తైన మరుగుదొడ్ల ఫోటోలను ఫీల్డ్ ఆసిస్టెంట్లు ఫోటో తీసి ఆగష్టు ఆరవ తేదీలోగా పంపించాలని, తద్వారా మరుగుదొడ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తారని అన్నారు. ఆగష్టు ఆరవ తేదీలోపు ఫోటోలు అప్‌లోడ్ చేయకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం పనులపై సోషల్ ఆడిట్‌కు వచ్చే బృందాలకు ఎంపీడీవోలు, ఎపీవోలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూర్‌నాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ములుగు ఆర్‌డీవో రమాదేవి, సీపీవో కొంరయ్య, ఎంపీడీవోలు, ఎస్‌బీఎంలు, అధికారులు, నియిమిన్సీసా చంద్రశేఖర్, సోంనాయక్ తదితరులు పాల్గొన్నారు.