వరంగల్

‘కంటి వెలుగు’కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని అధికారులు వందశాతం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత అన్నారు. సోమవా రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వివిధ మండల అధికారులతో కంటి వెలుగు, హరితహారం, నర్సరీల ఏర్పాటు నూతన గ్రామ పంచాయతీల గ్రామసభల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న ప్రారంభమైయ్యే శిబిరాలలో పూర్తి అందత్వ నివారణకు ప్రభుత్వం ‘కంటివెలుగు’ కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు, మందులు, కంటి అద్దాలను ఇస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందుకు అధికారులు ఇప్పటికే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. గతంలో రైతు బంధు పథకాన్ని విజయవంతం చేసినట్టుగా ఇప్పుడు కూడా తగి న ఏర్పాట్లతో సన్నద్ధం కావాలన్నారు. గ్రామాలలో ఆశ వర్కర్స్ ద్వారా కంటి వెలుగు శిబిరానికి రావాల్సిందింగా ప్రతి ఇంటింటింకి తిరిగి ఆహ్వాన పత్రాలు, స్లిప్స్ ఇచ్చి గుర్తించిన 16 ప్రాంతాల్లో శిబిరాలకు రావలసిందిగా ఆహ్వనించాలని, ఇందుకు మండల, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించాలని అన్నారు. డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో, మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులను ఆప్రమత్తం చేయాలని సూచించారు. అదే విధంగా హరితహారంలో మొక్కలు నాటడంలో లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలో మొక్కలు నాటించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన నర్సరీల జాబితాను త్వరగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పా టు చేసిన కొత్త గ్రామ పంచాయితీలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, గ్రామ పం చాయితీకి సంబందించిన ఆర్ధిక లావాదేవిలకుగాను గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి కలిసి బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఖాతా తెరిచి త్వరగా పంపించాలని చెప్పారు. గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి రూ.8500 వేతనం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసిందని పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ శేఖర్‌రెడ్డి, డీఎఫ్‌వో పురుషోత్తం, డీఎంహెచ్‌వో వెంకటరమణ కంటి వెలుగు ప్రొగ్రాం ఆఫీసర్ మహేంద్రన్, తదితరులు పాల్గొన్నారు.