వరంగల్

కొనసాగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే5: వరంగల్ జిల్లాలో రెండవ రోజు గురువారం కూడ ఆర్మీ రిక్రూట్‌మెంట్ కొనసాగింది. నగరంలోని హన్మకొండ జెఎన్‌ఎస్ గ్రౌండ్‌లో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన అభ్యర్ధులకు ఆర్మీ అధికారులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలోని 10 జిల్లాల నుండి అభ్యర్ధులు పాల్గొన్నారు. దేహధారుడ్య, పరుగుపందెం లాంటి పరీక్షలు చేపట్టారు. కాగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఏర్పాట్లకు గాను సింగరేణి కాలరీస్ సంస్ధ చేయూత అందించింది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లకోసం సింగరేణి సంస్ధ సిఎండి ఎన్. శ్రీ్ధర్ సిఎస్‌ఆర్ నిధుల నుండి 10లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు అందచేసారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే నిరుద్యోగ యువత కోసం భోజన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో సింగరేణి చేయూత నందించింది.