వరంగల్

ఇంటికో ఉద్యోగం ఎక్కడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 24: తెరాస నేతలారా గత ఎన్నికలలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినంగా కనీసం మండలానికో ఉద్యోగం అయిన ఇచ్చారా అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆల్గీరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రాత్రి భీమదేవరపల్లి మండలం బోల్లపల్లి, ముస్తలపూర్, మంకా నాయక్ తండా, కొత్తపల్లి తండాలలో ప్రవీణ్‌రెడ్డి విసృత ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాక ముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని విఫలం చెందారని అన్నారు. నిరుపేదల అయిన ఎస్సీ, ఎస్టీ బీసీలకు లక్షలలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి గూడు కల్పించిందన్నారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్మల భీంరెడ్డి, మోహన్, సమ్మయ్య, గోపి, ఐలయ్య, రాఘురాంనాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం
ఈనెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు: ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి
వరంగల్, సెప్టెంబర్ 24: ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు త్వరలోనే ప్రభుత్వ ఆమోద ముద్ర వేయనుందని కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ చైర్మెన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కుడా కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పట్టణాభివృద్ది సంస్థ బోర్డు సమావేశంలో ఆమోదించి, ప్రభుత్వానికి పంపించాల్సి ఉండగా బోర్డు మెంబర్ సాయిప్రసాద్ అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ కావడంతో మాస్టర్ ప్లాన్‌కు ఆలస్యం జరిగిందని తెలిపారు. త్వరలోనే కొత్త బోర్డు మెంబర్ నియామాకం జరిగిన వెంటనే నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తామని ఎన్నిల నోటిఫికేషన్ వచ్చేలోపే మాస్టర్‌ప్లాన్‌కు ఆమోద ముద్రపడడం ఖాయమని పేర్కొన్నారు. గత నెల 6,7 తేదీలలో నిర్వహించిన వేలం పాటలను తిరిగి ఈ నెల 26న నిర్వహిస్తామని అన్నారు. ఓ-సిటిలో-18ఖాళీప్లాట్లు, అంబేద్కర్ భవన్ పక్కన నిర్మించిన కుడ అపార్టుమెంట్‌ల సముదాయంలో-12 ప్లాట్లు, ఒక షెట్టర్ మిగిలిందని, ఇంతకుముందు నిర్ణయించిన ధరలకే వేలం పాట నిర్వహించ నున్నామని తెలిపారు. సకల సదుపాయాలు కలిగిన అపార్టుమెంట్లు, అన్ని హంగు లు కలిగిన ఓసిటిలో మిగిలిన ఖాళీ ప్లాట్ల కోనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హన్మకొండ బస్‌స్టాండ్ జంక్షన్‌లోని కుడా కమర్షియల్ కాంప్లెక్స్‌కోసం ఈనెల 30లోగా టెండర్లను ఆహ్వానిస్తున్నామని అన్నారు. 60వేల ఎస్‌ఎఫ్‌టీలతో కలిగిన నాలుగు అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్‌ను మూడు సంవత్సరాల లీసుకు గాను టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, ఎదైన వ్యాపారం చేసుకోవడానికి ఒకే వ్యక్తికి నాలుగంతస్థుల సముదాయాన్ని ఇవ్వనున్నామని, ప్రత్యేకంగా స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ల్యాండ్ రెగ్యూలరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్)కు ఈనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, గతంలో 10వేల రూపాయలు కట్టి, ఆగిపోయిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉందని తెలిపా రు. మడిపెల్లి గ్రామంలో అన్ని హంగులతో నిర్మిస్తున్న టౌన్‌షిప్‌కు దసరా లేదా దీపావళి లోగా వేలం పాటలు నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.