వరంగల్

మానుకోటను జిల్లా కోసం ముఖ్యమంత్రిని ఒప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లికుదురు, మే 9: జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయడానికి అన్ని వనరులు ఉన్న మానుకోటను జిల్లాగా ఏర్పాటుచేయడానికి ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావులు అన్నారు. మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన నడిమిడి చెరువు, బోడ్లాడలోని కొండలమ్మ చెరువులను మిషన్‌కాకతీయలో బాగంగా అభివృద్ధి పరచడానికి ఎమ్మెల్యే సోమవారం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ...రైల్వే లైన్‌తో పాటు జిల్లాలో ఎక్కువ రెవెన్యూ ప్రాంతం అయిన మానుకోటను జిల్లాగా చేయడానికి ఎంపి సీతారాంనాయక్‌తోపాటు ఇతర నాయకులతో కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ఒత్తిడి తెచ్చిఅయిన మానుకోటను జిల్లాగా సాధించుకుంటామన్నారు. సమావేశంలో ప్రజలు మానుకోట జిల్లా విషయంపై ప్రశ్నించడంతో వారు ఈ విధంగా వివరణ ఇచ్చారు. మునిగలవీడు నడివిడి చెరువును రూ. 42లక్షలతో అభివృద్ధిచేస్తున్నట్లు, బొడ్లాడలోని కొండలమ్మచెరువును రూ.48లక్షల 33వేలతో అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు. చెరువుల అభివృద్ధిలో పార్టీల కతీతంగా అందరు బాగస్వాములైతేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ పథకం, కేసిఆర్ కల సాకారం అవుతుందన్నారు. ప్రభుత్వం రోడ్ల అభివృద్ధితో పాటు ప్రతి గ్రామానికి, తండాకు మిషన్ భగీరధ పథకం ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు కంకణం కట్టుకుందన్నారు. దళితులకు, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, ఆసర పెన్షన్‌లు, కళ్యాణ లక్ష్మి, ఒక్కో వ్యక్తికి 6కిలోల చొప్పున బియ్యం, కెజి టు పిజి విద్య, విద్యార్తులకు సన్న బియ్యం తదితర పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రపంచంలోనే తెలంగాణను సంక్షేమంలో, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతున్నారన్నారు. నర్సంపేట నుండి బ్రహ్మణకొత్తపల్లి, బొడ్లాడల మీదుగా సూర్యపేటకు బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసి అధికారులతో మాట్లాడి, ఒప్పించనున్నట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తెలిపారు. గ్రామాలలో సమస్యలు లేకుండా శక్తివంచన లేకుండా నిధులు తేవడానికి కృషిచేస్తానని తెలిపారు.