వరంగల్

18నుంచి జన్ ఔషధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 10: భారత ప్రభుత్వ ఔషధ శాఖ దేశ ప్రజలకు చౌక ధరల్లో మందులు లభ్యం కావడానికి జన్ ఔషధి జనరిక్ స్టోర్స్‌ను ప్రారంభించింది. నిత్యవసర మందులను అందరికీ అందుబాటులో గల ధరలకు అమ్మేందుకు వీలుగా కలెక్టర్ వాకాటి కరుణ సూచనల మేరకు వందేమాతరం ఫౌండేషన్ ఈ కార్యచరణకు పూనుకుంది. అందులో భాగంగా జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో జన్ ఔషది మందుల విక్రయాలకు ఏర్పాటు చేసేందుకు వందేమాతరం ఫౌండేషన్ ప్రణాళిక చేసింది. కలెక్టర్ ప్రజలకు జన్ ఔషధాలను అందజేయాలన్న సంకల్పాన్ని అభినందించడానికి కేంద్ర ప్రభుత్వ జన్ ఔషధి దక్షిణ భారత నోడల్ అధికారి విజయ్‌సింగ్ రాజ్‌పుట్ మంగళవారం వరంగల్‌కు విచ్చేశారు. ఔషధాల మీద ప్రజలు ఖర్చు చేసే వందల కోట్లు... వారి కష్టార్జితాన్ని కాపాడేందుకు నెలకొల్పుతున్న జన్ ఔషధి ప్రయత్నాన్ని విజయ్‌సింగ్ రాజ్‌పుట్ కొనియాడారు. రాజస్థాన్‌లో ఇది ఒక ఉద్యమంగా మారిందని, 80 శాతానికి పైగా ప్రజలు మందులను చౌక ధరల్లో జనరిక్ విక్రయశాలల్లో ఖరీదు చేస్తున్నారన్నారు. ఈ తరహాలో కలెక్టర్ చొరవతో జిల్లాలోని వైద్యులంతా తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్ మందులను రాయాలని ఆదేశించారు. 80 శాతానికి పైగా చౌక ధరల్లో లభ్యమయ్యే మందులను అందరికి అందుబాటులోకి తీసుకరావడానికి నగరంలోని రెడ్‌క్రాస్, వందేమాతరం ఫౌండేషన్‌కు బాధ్యతను అప్పగించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఐడిపిఎల్, హెచ్‌ఏఎల్, కెఎపిఎల్, పిడిపిఐ ఇవే కాకుండా ప్రముఖ బహుళజాతి కంపెనీలు ఇస్తున్న జనరిక్ మందులు అన్ని జన్ ఔషధి విక్రయ శాలలో అందుబాటులో ఉంటాయని అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ ప్రత్యేకంగా తీసుకున్న ఈ చొరవ జిల్లా ప్రజలకు వరంగా మారనుందని అన్నారు. ఈ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని, ఔషది జనరిక్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నోడల్ అధికారి విజయ్‌సింగ్ రాజ్‌పుట్ జిల్లా కలెక్టర్‌తో సమావేశం అయ్యారు. ఈ మేరకు జిల్లాలో ఈ నెల 18వ తేదీన జన్ ఔషది జనరిక్ మందుల షాపును కలెక్టర్ ప్రారంభించనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షులు విజయ్‌చందర్‌రెడ్డి, జనరిక్ సమన్వయ కర్త శివాజీ, తోట పూర్ణచందర్‌రావు, రేకూరి సూర్యకిరణ్, డాక్టర్ రవిందర్‌రావు, సుభాషిణి పాల్గొన్నారు.