వరంగల్

బలహీన వర్గాల ఆశాజ్యోతి బాపులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, నవంబర్ 8: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్ అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే 125 వర్ధంతి పురస్కరించుకుని కెయు దూరవిద్యా కేంద్రం వద్దగల పూలే దంపతులకు సీతారాం నాయక్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగించడానికి అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. నేటి తరానికి ఆయన జీవితాన్ని పరిచయం చేయాలని సూచించారు. సామాజిక ఉద్యమాలకు మూల పురుషుడని, వితంతు వివాహాలను ప్రోత్సహించి బాల్య వివాహాలను నిషేధించాలని పోరాడిన మహనీయుడని కొనియాడారు.

కక్షిదారులకు సత్వర న్యాయం
తొర్రూరు, నవంబర్ 28: పలు కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో గత కొనే్నళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్ జిల్లా పోర్టు పోలియో జడ్జి ఎంఎస్ రాంచందర్‌రావు అన్నారు. తొర్రూరులో సుమారు 3.62 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన సముదాయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాలలో అవసరమైన పోస్టులు, వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చి భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు సమన్వయంతో పనిచేసి కృషి చేయాలని సూచించారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు సంతృప్తి కలిగేలా న్యాయవ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైన పాట్నా హైకోర్టు మాజీ ప్రదాన న్యాయమూర్తి ఎల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థను ప్రజల ముంగిటికి తీసుకెల్లేందుకు కృషి చేయాలని సూచించారు.