వరంగల్

కొనేదెలా? తినేదెలా!:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 26: ఎండల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడింది. దీంతో కూరగాయలు, చికెన్, బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయల ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో సామాన్య ప్రజలు నిట్టూరుస్తున్నారు. టమాట, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో పచ్చిమిర్చి 200లకు చేరింది. టమాట నుండి మొదలుకొని బెండకాయ, చిక్కుడుకాయ, క్యారెట్, దోసకాయ తదితర అన్ని రకాల కూరగాయలు కిలో 60కి పైగా విక్రయిస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పప్పుల ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా బియ్యం ధరలకు కూడా రెక్కలు రావడంతో ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్లు లేదన్న చందంగా మారింది. ఎండలు ఇదే విధంగా కొనసాగితే కూరగాయల ధరలు మరింత పిరం అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వ్యాపారులు అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో కూరగాయల తోటలకు నీళ్లు లేక వాడిపోతున్నాయి. మరోవైపు మటన్, చికెన్ ధరలు కూడా కొండెక్కాయి. ఎండలకు కోళ్లు చనిపోతుండడం, బరువు తగ్గడంతో కిలో చికెన్ 200కు దాటిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.