వరంగల్

ఉద్యమ ద్రోహులకు అందలం..ఉద్యమకారులకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 2: తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకంగా పని చేసిన వారినే ముఖ్యమంత్రి కెసిఆర్ అందలమెక్కిస్తూ ఉద్యమకారులను అవమాన పరుస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. గురువారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకులు ఉద్యమకాలంలో రాళ్లు, తుపాకులతో దాడులు చేసి నేడు ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన టిడిపి, వైఎస్సార్‌సిపిల నుండి వచ్చిన వారిని ముఖ్యమంత్రి కెసిఆర్ అందలమెక్కిస్తున్నాడని విమర్శించారు. టిఆర్‌ఎస్ పార్టీ నేడు ఉద్యమ వ్యతిరేకులతో కలుషితమైందని, ఇది ఉద్యమానికి, అమరవీరులకు అవమానకరమన్నారు. ఎన్నికల్లో 63 ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన టిఆర్‌ఎస్ నేడు 85 మంది నుండి 90 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పిరాయింపుల వల్ల పదవులు ఆశించి టిఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్తున్నారని విమర్శించారు. కొందరు బడుద్దాయి ఎమ్మెల్యేలు బజారులో అంగడి సరుకులా అమ్ముడుపోతున్నారని ఘాటుగా స్పందించారు. అటు ఏపి సిఎం చంద్రబాబు ఇటు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రతిపక్షాలు లేకుండా కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల నాటికి ప్రజలే ప్రతిపక్షంగా మారుతారని ఆయన హెచ్చరించారు. ఉద్యమంలో ముందుండి పని చేసిన కోదండరాం లాంటి వారిని విస్మరించడం సరైంది కాదని అన్నారు. జాతీయ రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం మద్దతు ఇచ్చిన సిపిఐ సలహాలు కూడా తీసుకోవడం లేదని, రాజకీయ మర్యాద తెలియని వ్యక్తి సిఎంగా ఉండడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండ్లు, పింఛన్లు ఇవ్వడంతోనే తన బాధ్యత తీరినట్లు ప్రభుత్వం భావిస్తుందని, అధికారంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందేనన్నారు. ఆత్మహత్యలు, వలసలు, ఆకలి చావులు లేని తెలంగాణను నిర్మిస్తామని చెప్పిన కెసిఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.