వరంగల్

బాల్య వివాహానికి బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, జూన్ 2: మండల కేంద్రంలోని మానసపల్లి ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు వివాహం చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం రాత్రి వివాహాన్ని అడ్డుకున్నారు. వివరాలలోకి వెళితే...మండలంలోని మానసపల్లికి చెందిన కుమ్మరి సారయ్య కుమార్తెకు మండలంలోని బుట్టాయిగూడెంకు చెందిన జనగాం బక్కయ్య కుమారుడు ఆనంద్‌తో ఈ నెల 1న వివాహం చేసేందుకు నిశ్ఛయించి, రాత్రి 11:06నిలకు ముహూర్తం నిర్ణయించారు. కాగా మండల కేంద్రంలోని శివాలయంలో వివాహం జరుగుతోందనే సమాచారం మేరకు ఎస్సై మోతె నరేష్ సిబ్బందితో సంఘటనా స్ధలానికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహించారు. గురువారం ఉదయం స్ధానిక ఐసిడిఎస్ అధికారులకు బాలికను అప్పగించగా, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18సంలు నిండిన తరువాత ఆడపిల్లలకు వివాహాలు చేయాలని తెలియజేశారు.