వరంగల్

అవినీతి నిరూపణకై చర్చకు సిద్ధమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూన్ 12: అవినీతి అక్రమాలను నిరుపించేందుకు ఏ వేదికపైనా అయినా చర్చకు సిద్దమేనని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రఘునాధ్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ. 1100 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పుకుంటున్న మధుసూదనాచారి ఎన్నికల ముందు ఇచ్చిన హామిలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. భూపాలపల్లిలో ఓపెన్‌కాస్టు మైనింగ్‌ను నిలిపి వేయించి, బావుల ద్వారానే బొగ్గు తవ్వకం జరిగేలా చూస్తానని ఇచ్చిన హామి అమలుకు నోచుకోలేదన్నారు. ఓపెన్‌కాస్టు తవ్వకం వల్ల భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇప్పించలేదన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక అత్యంత అధ్వాన్యంగా ఉందని, డాక్టర్లు లేరని, మందులు లేవని, రోగులకు కనీస వైద్యం అందడం లేదన్నారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి గురించి పట్టించుకోవాలన్న ఆలోచన స్పీకర్‌కు లేదని చెప్పారు. సింగరేణిలో, జెన్‌కోలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని, భూనిర్వాసితులకు సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని చేసిన వాగ్దానాలు కూడా నీటి మూటలుగానే మారి పోయాయని అన్నారు.