వరంగల్

భూపాలపల్లి కేంద్రంగా... ఆచార్య జయశంకర్ జిల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, జూన్ 12: కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం స్పష్టత నిచ్చినట్టే. అయితే వరంగల్ జిల్లాలో భూపాలపల్లిని జిల్లా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త జిల్లాకు ఆచార్య జయశంకర్ జిల్లాగా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. అక్టోబర్ 11న విజయదశమి రోజు నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అక్కడ నుంచే పరిపాలన సాగించనున్నారు. రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నూతన జిల్లాల ఏర్పాటుపై జిల్లా పాలనాధికారులతో జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది.
భూపాలపల్లి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ తాము అధికారంలోకి వస్తే భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ప్రకటించనున్నారు. జయశంకర్ సార్ పేరు పెట్టడం వల్ల పోరుగడ్డ భూపాలపల్లి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అందరికి సంతోషాన్ని కలిగించనుంది. అయితే భూపాలపల్లి జిల్లా ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే. అందుకు ప్రభుత్వం కార్యచరణ కూడా ప్రకటించింది. ఈనెల 20వ తేది, జూలై 5వ తేదిల్లో మరో మారు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించ నున్నారు. ఈనెల 30వ తేదిలోపు ప్రజాప్రతినిధులతో చర్చించి రాజకీయ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టు 4వ తేది నుండి 10వ తేదిలో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దాదాపు భూపాలపల్లిని నూతన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినట్లుగానే భావించవచ్చు. అకోబర్ 11వ తేది విజయదశమి రోజు నుంచి నూతన జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా నూతన జిల్లా ఏర్పాటులో అధికార యంత్రాంగం చకచక కసరత్తు చేయడానికి సిద్దం అవుతుంది. ఆచార్య జయశంకర్ సార్ జిల్లాను అధికారికంగా ప్రకటించిన తరువాత శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాల నివేదికను రెవెన్యూ అధికారులు సిద్దం చేయడానికి సిద్దం అవుతున్నారు. త్వరలో ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. జిల్లా ప్రభుత్వ కార్యాలయాల పక్క భవనాల నిర్మాణం అయ్యే వరకు రెవెన్యూ అధికారులు తాత్కాలిక భవనాల కోసం పరిశీలించనున్నారు. భూపాలపల్లిలో తాత్కాలిక జిల్లా పాలనాధికారి కార్యాలయ భవనం, భవిష్యత్‌లో జిల్లా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములను ఎంపిక చేయడంలో అధికారులు త్వరలో పరిశీలించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కెసిఆర్ విజయదశమి రోజు అధికారికంగా కొత్త జిల్లాల ప్రకటన చేసే లోపు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి అవసరమైన భవనాల ఏర్పాటు చర్యలు వేగవంతం చేయడానికి అధికారులు సిద్దం అవుతున్నారు. అయితే జిల్లా పాలనాధికారి, సంయుక్త పాలనాధికారి, ఎస్పీ వంటి పోస్టులను ప్రభుత్వమే భర్తి చేయనుంది. మిగిలిన అధికార, ఉద్యోగుల పోస్టుల భర్తినీ జిల్లా పాలనాధికారి ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న అధికారులను, ఉద్యోగులను సర్దుబాట చేయనున్నారు.