వరంగల్

న్యాయవాదుల ఆందోళన ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 1: తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. శుక్రవారం జిల్లా న్యాయస్థానం ఎదుట న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీమాంధ్ర జడ్జిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సీమాంధ్ర జడ్జిల ఆప్షన్ విధానం రద్దు చేసి వెంటనే తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తుల సస్పెషన్స్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జ్యూడిషనల్ ఉద్యోగులు కూడా సమ్మె చేపట్టారు. దీంతో శుక్రవారం జిల్లా న్యాయస్థాన డోర్లు కూడా తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. సమ్మెలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ హైకోర్టు గైడ్‌లైన్‌కు విరుద్ధంగా న్యాయమూర్తుల పంపకాల ప్రక్రియ ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.