వరంగల్

రూ.480 కోట్లతో మిషన్ భగీరధపనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూలై 1: నర్సంపేట నియోజకవర్గంలో రూ. 480 కోట్లతో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టిఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసి మంచినీటిని నల్లాల ద్వారా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌భగీరద పథకాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గానికి కృష్ణ జలాలను అందించేందుకు పాలమూరులో మొదటి దశ పనులను పూర్తి అయ్యాయని తెలిపారు. ఫేజ్-3 కింద నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలను డిజైన్ చేయడం జరిగిందని, ఈమేరకు టెండర్లు పూర్తి అయ్యాయని వెల్లడించారు. 310 కోట్లతో నియోజకవర్గంలో ఆరు మండలాలకు 382 హ్యబిటేషన్ల ద్వారా పైప్‌లైన్ పనులను గ్రామాలు, తండాల వెలుపలిభాగం వేయడం సిద్ధం చేయడం జరిగిందన్నారు. రూ. 172 కోట్లతో అన్ని గ్రామాలు, తండా, నగరపంచాయతీలకు ఇంట్రావర్క్ కింద మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో 155 ఓహెచ్‌ఆర్‌ఎస్ ట్యాంకులు అవసరం ఉన్నాయని తెలిపారు. నాలుగు సంప్‌హౌజ్‌లు నిర్మించడం జరుగుతుందన్నారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లివద్ద రాంపూర్‌లో, నల్లబెల్లి మండలం భాంజీపేటలోని రాంనగర్, నెక్కొండ మండలంలోని పత్తిపాక, భద్యతండాలలో సంప్‌హౌజ్‌లను నిర్మించడం జరుగుతుందన్నారు. ఒక బ్రెక్ ఫెర్షర్ పాయింట్ (బిపిపి) ద్వారా నీటిని సమానంగా పంపండానికి ఎక్కువ ప్రాంతం, దిగువ ప్రాంత పరిస్థితులకు అనుసంధానంగా నీటిని పంపించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 250 కేల్ సామర్ధ్యంతో రాజుపేట శివారు జంగాలపల్లితండాలో, వల్లబ్‌నగర్‌లో ఎస్సీ కాలనీలో 300కె ఎల్ సామార్ధ్యంతో నింపేందుకు బిపిపి నిర్మించడం జరుగుతుందన్నారు. అర్బన్‌లో ఒక రోజు ఒక మనిషికి 150 లీటర్లు, రూరల్ ఒక రోజు ఒక మనిషికి 130 లీటర్ల చొప్పున అందించేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు నీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మిషన్‌భగీరద అవరమైన పొలాలను రైతుల వద్ద మార్కెట్ రేటు చొప్పున విలువ కట్టి తీసుకోవడం జరిగిందన్నారు. పైప్‌లైన్ వేస్తున్న క్రమంలో రోడ్డుక్రాసింగ్, ప్రైవేట్ వ్యక్తుల స్థలం, ప్రభుత్వ స్థలమని ఎవరు అడ్డుకోకుండా పైప్‌లైన్ పనులు నిర్మాణం జరిగేవిధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్, వైస్ చైర్మన్ మునిగాల పద్మావెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు నాయిని నర్సయ్య, గుంటి కిషన్, బండి ప్రవీణ్, నాయకులు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ఎంవి రామారావు, మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, పుట్టపాక కుమారస్వామి, దార్ల రమాదేవి, ఇర్ఫాన్, వేముల సాంబయ్య పాల్గొన్నారు.