వరంగల్

మల్లన్నసాగర్ నిర్వాసితులకు బాసటగా ఉంటాం: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, జూలై 25: మల్లన్నసాగర్ నిర్వాసితులపై, లాఠీచార్జికి నిరసనగా సోమవారం హన్మకొండలోని అశోక జంక్షన్‌లో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మెదక్ జిల్లా మల్లన్నసాగర్ నిర్వాసితులపై, లాఠీచార్జి తగదన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నారన్నారు. అన్నదాతలపై దాడి చేయడం అమానుషమని, సాంకేతికంగా సాధ్యంకాని మల్లన్నసాగర్ కోసం ప్రభుత్వం దౌర్జన్యంగా పేద రైతుల భూములను లాక్కుంటుందన్నారు. న్యాయం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా స్పందించని కారణంగానే అన్నదాతలు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలని చూడకుండా పోలీసులు రక్తమోడేలా చితకబాదారన్నారు. దేశంలో ఎక్కడ ఇంత ఘోరమైన దాడులు జరగలేదన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు బాసటగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వ దౌర్జన్యాలను అన్ని పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు ఖండించాలన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై, లాఠీచార్జికి నిరసనగా నేడు (మంగళవారం) హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి మెదక్ జిల్లా మల్లన్న సాగర్ వరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, పిసిసి మాజీ కార్యదర్శి ఇవి శ్రీనివాస్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోహర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, మాజీ కార్పొరేటర్ నెక్కొండ కిషన్, గొట్టెముక్కల రమణారెడ్డి, భాస్కర్, శేఖర్, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.