వరంగల్

భావితరాలకు మొక్కలే భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుూంనగర్, జూలై 25: నేటి మొక్కలే భవిష్యత్తుతరాలకు వృక్షాలుగా మారి భరోసాగా నిలుస్తాయని పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. సోమవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా పద్మాక్షమ్మగుట్ట ప్రాంతంలోని జయ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం కళాశాలకు చెందిన విద్యార్ధులు పోలీసుల సహకారంతో 500 మొక్కలను కళాశాల ప్రాంగణంలో నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొక్కను నాటిన విద్యార్థులే ఆ మొక్కను పరిరక్షించుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. మొక్కలను పరిరక్షించుకోవడం కోసం ప్రతి మొక్కకు ఒక ట్రీ గార్డ్ ఏర్పాటు చేసుకొని పరిరక్షించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల పుట్టినరోజు, పెళ్లిరోజున ఒక మొక్కను నాటడం ఆనవాయితీగా చేసుకోవల్సిన అవసరం ఉందని వివరించారు. మొక్కలను నాటడమే కాదు, నాటిన మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని అన్నారు.