వరంగల్

పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లివ్వడంలో ప్రభుత్వ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జూలై 26: నిరుపేదలందరికీ 58జీవో ప్రకారం వ్యక్తిగత డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించివ్వాలని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నగర నాయకులు టి.ఉప్పలయ్య అన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ప్రభుత్వ, చెరువుశిఖం, దేవాదాయ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసముంటున్న పేదలందరికీ 58జీవో ప్రకారం వ్యక్తిగత ఇండ్లు నిర్మించివ్వాలని మంగళవారం హన్మకొండ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకంలో ఇప్పటి వరకు ఒక్క పేదవానికి కూడా ఇండ్లు కట్టివ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినా నగరంలో ఉంటున్న నిరుపేదలు 3వేల వరకే ఉన్నారని, వీరందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించివ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేమన్నారు. అదే విధంగా నగరంలో 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని నివాసముంటున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించివ్వాలన్నారు. ప్రభుత్వానికి వేలాది మంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తులు పెట్టుకొని రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు వారిని సర్వే చేయడం గాని, అర్హులా, అనర్హులా అని తేల్చడానికి కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నగరంలో అనేక సమస్యలతో కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని పరిష్కరించేందుకు నగర పాలకవర్గం కూడా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.