వరంగల్

ప్రతి కార్మికుడి భద్రత ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 1: ప్రతి కార్మికుని జీవిత భద్రత ప్రభుత్వానిదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రమాదవశాత్తు చనిపోయిన ఏ కార్మికుడికైనా జీవితబీమా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్టమ్రేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వరంగల్ నగరంలోని హన్మకొండ పట్టణంలో జరిగిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా 77 కోట్ల రూపాయల టాక్స్‌ను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనన్నారు. ఏ కార్మికుడైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడవద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 10లక్షల మంది కార్మికులకు జీవితబీమా పథకాన్ని అమలు చేశారన్నారు. అయితే, ప్రమాదవశాత్తే కాకుండా సాధారణ మరణం చెందినా కూడా బీమా వర్తించే విధంగా తనవంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో పేదలందరికి పూర్తిస్థాయి వైద్య సదుపాయం అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం యోచిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష 60వేల మంది విద్యార్థులకు 260 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆటో కార్మికుల పిల్లలకు కూడా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. బ్యాంకులు పేదలకు రుణాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, బ్యాంకులు ఎవరబ్బ సొత్తుకాదని, ప్రతి పేదవాడికి బ్యాంకు రుణాలు అందాలని ఆయన అన్నారు. బ్యాంకులు నడిచేదే ప్రజాధనంతోనని, బ్యాంకులు కూడా పేదల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. వెయ్యి కోట్లతో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఆటో కార్మిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఇది తన పరిధిలో లేదని, అయినప్పటికీ తాను ఏటా వెయ్యి మంది ఆటో కార్మికులకు రుణాలు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. లక్ష రూపాయలు ఉన్న రుణాన్ని పది లక్షలకు పెంచామని, లక్ష రుణం తీసుకున్న లబ్ధిదారుడు కేవలం 20వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. చదువు, పేదరికానికి, కులానికి, మతానికి సంబంధం లేదని ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా నేడు బిటెక్, ఎంటెక్‌లు చదువుతున్నారని అన్నారు. సమాజం ఆటో డ్రైవర్లను చదువురానివాడిగా గుర్తించవద్దని, నిరుద్యోగులకు వారికి గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఫైనాన్సర్లు వేధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. త్వరలోనే నగరంలో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక షెల్టర్లు నిర్మిస్తామని అన్నారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కోసం వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ఆరూరి రమేష్, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గుడిమళ్ల రవికుమార్, యూనియన్ నాయకులు మేకల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.ముందుగా ఉత్తమ ఆటో డ్రైవర్లను మంత్రి ఈటెల రాజేందర్ సన్మానించారు.