వరంగల్

కెటిఆర్ ఫ్యాక్టరీల కోసమే ‘మల్లన్నసాగర్’: సీతక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, అగస్టు 1: కెటిఆర్‌కు చెందిన కెమికల్ ఫ్యాక్టరీ నీటి అవసరాల కోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ కుట్ర జరుగుతోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సోమవారం పరకాలలో నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ భూసేకరణ చట్టం 2013ను కాదని 123 జిఓను తెర మీదకు తీసుకొచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పేరట భూ సమీకరణ చేస్తూ రైతుల పొట్టగొట్టాలని కుట్ర పన్నిందని అన్నారు. ఎకరానికి 60వేల రూపాయలు ఇస్తామని చెప్పుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఫామ్‌హౌస్‌లోని భూమి ఎకరానికి రూ. 60 వేల రూపాయలకు అమ్ముతారా? అని ప్రశ్నించారు. డాక్యూమెంటరీల మాదిరిగా బోనాలు, హరితహారం వంటి కార్యక్రమాలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, ఇంటింటికి పైపులైన్ ద్వారా మంచినీటిని అందిస్తామని చెప్పుతున్న మాటలు మోసపూరితమన్నారు. ఎంసెట్-2 లీకేజికి బాధ్యత వహిస్తూ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలను మభ్యపెట్టి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టిఆర్‌ఎస్‌లోకి తీసుకవెళ్లి నమ్మకద్రోహం చేశారన్నారు.

కురవి ఆంధ్రాబ్యాంకులో
చోరీకి విఫలయత్నం
సిసి కెమెరాలు ధ్వంసం * పక్కా ప్లానింగ్ ప్రకారమే
చోరీ జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు
కురవి, ఆగస్టు 1: వరంగల్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఘటన స్థలాన్ని కురవి సిఐ శ్రీనివాస్‌నాయక్, మానుకోట టౌన్ సిఐ నందిరాంనాయక్‌లతోపాటు ఎస్సైలు రామకృష్ణ, బాబులాల్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగల జాడ తెలుసుకునేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. బ్యాంకు అధికారులు డిజిఎం శివప్రసాద్, ఎజిఎం సూర్యనారాయణ, సెక్యూరిటీ అధికారి గిరి ప్రసాద్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించి, కురవి బ్యాంకు మేనేజర్ అబ్దుల్ అజీజ్, క్యాషియర్ రంజిత్‌ల నుండి వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకు, పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిసెంటర్‌కు కూత వేటు దూరంలోని సహకార బ్యాంకు ఆవరణలోని రెండు గదుల్లో ఆంధ్రాబ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తోంది. బ్యాంకు ఎటిఎం గార్డు దయాకర్ 12గంటల వరకు బ్యాంకు పరిసరాలను పరిశీలించాడు. అనంతరం పక్కాప్లానింగ్ ప్రకారం ఒక్కరా? ఎక్కువ మందా? అన్నది తెలియదుకాని, ఆరితేరిన దొంగల వలే మాస్క్‌లు, చేతులకు గ్లౌజు ధరించి సిసి కెమెరాల వైర్లను తొలగించారు. బ్యాంకులో భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు భవనం ముందు, వెనుక రెండు కెమెరాలు, బ్యాంకులోపల రెండు, లాకర్‌ల ప్రదేశంలో మరొక కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా లాకర్ తలుపును తడితే అలారం వచ్చే అవకాశం ఉంది.
బ్యాంకు వెనుక భాగాన ఉన్న గోడ దూకి దొంగలు లోనికి ప్రవేశించి, వెనుక భాగాన ఉన్న సహకార బ్యాంకు తలుపును పగులగొట్టి లోనికి వెళ్లి చూసుకున్నారు. బ్యాంకు పరిసరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న వారై ఉండవచ్చు అనే అనుమానం రాకమానదు. క్యాషియర్ కూర్చునే క్యాబిన్‌కు వెనుక ఉన్న తలుపును పగులగొట్టి మనిషి పట్టే సందును ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే ఉన్న సిసి కెమెరా పుటేజి ప్రకారం ముసుగు వ్యక్తి 12:50 నిమిషాలకు లోనికి ప్రవేశించాడు. తరువాత లోనికి వెల్లిన దొంగలు అలారం వైరుతోపాటు, సిసి లోని రెండు సిసి కెమెరాల వైర్లను తొలగించారు. అక్కడినుండి సేఫ్ లాకర్ ఉన్న ప్రదేశంలోకి వెళ్లేసరికి లాకర్ వద్ద ఉన్న కెమెరాలో ముసుగు వీరుడు చిక్కాడు. ఫుటేజి ప్రకారం 3:01 నిమిషాలకు లాకర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేసినట్లు నమోదైంది. అది వీలుకాకపోవడంతో వెనుతిరిగి ఉండవచ్చనుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ అజీజ్ తన ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించాడు. అందరి సమక్షంలో బ్యాంకులో ఎటువంటి చోరీ జరగలేదని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా బ్యాంకులో చోరీ సమయంలో కోట్లాది రూపాయల బంగారం, లక్షలాది రూపాయల క్యాష్ ఉందని సమాచారం. లోనికి ప్రవేశించిన దొంగల ప్రయత్నం ఫలించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు మేనేజర్ అజీజ్ ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.