వరంగల్

ప్రధాని సభను జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 2: హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఈనెల 7వ తేదీన జరిగే ప్రధానమంతి నరేంద్ర మోదీ సమ్మేళనం సభకు బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కోరారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మంగళవారం సమ్మేళనం సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఎడ్ల అశోక్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, అదే విధంగా 200ల కోట్లతో కాళోజి ఆరోగ్య కేంద్రం, సూపర్ స్పెషలాటీ ఆసుపత్రి, రాష్ట్రానికి 80వేల ఇళ్లను, 70వేల మరుగుదొడ్లను మంజూరు చేసిందని చెప్పారు. హరిత హారానికి 70 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. రామగుండంలోని ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు 60 కోట్ల రూపాయలు, ఎన్టీపిసిలో 40వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదనకు 5వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో సిఎం కెసిఆర్ మాత్రం నైతిక బాధ్యత వహించాలని, లీకేజీ కారకులను బయట పెట్టకపోవడం సిఎం అవినీతికి నిదర్శమని అన్నారు. ప్రతిభ గల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. మోదీ బహిరంగసభకు నర్సంపేట నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలిరావల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కందగట్ల టాకరాజు, మండల అధికార ప్రతినిధి కల్వచర్ల ప్రవీణ్‌చారి, జిల్లా నాయకులు త్రిలోకేశ్వర్, రేసు శ్రీనివాస్, వడ్డెపల్లి నర్సింహారాములు, కూనమళ్ల పృథ్వీరాజ్, కమిటి సభ్యులు సూత్రపు సరిత, గాదె రాజ్‌కుమార్, నూనె రంజిత్, సంగినేని లకన్, మరిగింటి ప్రదీప్, గట్టు సాయికిరణ్ పాల్గొన్నారు.