వరంగల్

మొక్కలతో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగెం, అగస్టు 2: పచ్చని మొక్కలు విరివిగా పెంచితేనే అందరి ఆరోగ్యాలు క్షేమంగా ఉంటాయని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని నోటరి డేమ్ ఉన్నత పాఠశాలల్లో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచకపోతే వాతావరణ కాలుష్యమై ప్రజలందరు ఆనారోగ్యం బారిన పడుతారని, కరువు కాటకాలు సంబవించి ప్రకృతి వైపరీత్యాలతో జీవన విధానం అస్తవ్యస్తంగా తయారు అవుతుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులుగా ఎదుగుతారని, రేపటి భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి మొక్కలు నాటి పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో అందరు భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 9 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మమూనూర్ పోలీస్ డివిజన్‌లో చెట్ల మొక్కలు నాటడంలో ప్రథమ స్థానంగా నిలిచిందని చెప్పారు. చెట్లను నరికివేస్తూ మన బతుకులను మనమే నాశనం చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటిసి వీరమ్మ, ఎంపిపి కట్టయ్య, ఎంపిడిఓ భద్రునాయక్, మమూనూర్ సిఐ శ్రీనివాస్, ఎంపిటిసి బద్రి, సర్పంచ్ నర్సింహస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరి మధుజా, సంగెం, పర్వతగిరి, మమూనూర్ ఎస్సైలు క్రాంతికుమార్, వెంకట్రావ్, రాంప్రసాద్‌లు పాల్గొన్నారు.