వరంగల్

నాగులమ్మ జాతర ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, మార్చి 21: మండలంలోని రాజుపేట శివారు లక్ష్మీనర్సాపురంలోని ప్రసిద్ధి చెందిన నాగులమ్మ జాతర సోమవారం ప్రారంభమైంది. జాతరలో మొదటిరోజైన సోమవారం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు గోదావరి నదీ తీరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పుచప్పుళ్ళు, శివసత్తుల పూనకాల నడుమ గోదావరి జలాలను నాగులమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ, పూజారి బాడిశ నాగ రమేష్‌ల ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపు, కుంకుమ, ఆవునెయ్యి, పాలు, పవిత్ర గోదావరి జలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు సోమవారం శివరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, పోతురాజు, ఎర్ర మారెమ్మ గద్దెలను శుభ్రపరిచి పసుపు- కుంకుమలతో అలంకరించారు. లక్ష్మీనర్సాపురం, వాగొడ్డుగూడెం, కన్నాయిగూడెం, రాజుపేట ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లను సోమవారం పరకాల ఆలయ డివిజన్ ఇన్‌స్పెక్టర్ పోరిక భేల్ సింగ్ పరిశీలించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో కొమరం మాధవరావు, ధనలక్ష్మి, ఇర్ప రామకృష్ణ,నాగలక్ష్మి, కొమరం పాపారావు, గాయత్రి, పూజారులు, వడ్డెలు మడకం లక్ష్మయ్య, రమేష్, కారం రాజేష్, బాడిశ శ్రీదేవి, కట్టం సమ్మక్క, నాగరాజు, సోడి శ్రీను, కుర్సం పుల్లయ్య, ఈసం పద్మ, రామనాధం, అర్తిలు బాడిశ శ్రీను, నాగుల నాగేశ్వరరావు, వినోద్, కుల పెద్దలు చౌళం వెంకటేశ్వర్లు, కుర్సం విష్ణుమూర్తి, కారం సాంబయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.