వరంగల్

పోరుగడ్డ పరకాలకు అన్యాయం చేస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 4: పోరుగడ్డ పరకాలకు అన్యాయం చేస్తే ఊరుకోమని, పరకాల రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుదామని పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పరకాల నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఇనగాల నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి అయ్యేందుకు సాగిన పోరాటంలో ఈ ప్రాంత ప్రజలది అద్వితీయమైన పాత్ర ఉందన్నారు. పరకాలకు ఉద్యమాలు కొత్త కాదని చెప్పారు. నిజాం చరిత్ర కబంధ హస్తాల నుండి విముక్తులయ్యేందుకు చేయి చేయి కలిపి సాగించిన పోరాటం రక్తతర్పణంగా మారి మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్ర పుటల్లోకి నిలిచి పోయిందన్నారు. 1986 నుండి పరకాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉందని దానికి అనుగుణంగా పరకాలలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని నెలకొల్పారని చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వచ్చిన అనందం ఎంతో కాలం లేకుండా రాజకీయ కుట్రతో అప్పటి ములుగు ఎమ్మెల్యే, మంత్రి అయిన చందులాల్ దొంగచాటుగా రాత్రికి రాత్రే పరకాల ప్రజలు నిదిస్తున్న వేళ గజ దొంగలను మరిపించే రీతిలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ములుగుకు తరలించుకు పోయారని చెప్పారు. అనాటి కార్యాలయ తరలింపు నేటికి పరకాల ప్రాంత ప్రజల మనుస్సులో చేదు జ్ఞాపకంగా ఉండి పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటూ అధికార పార్టీ నాయకులు చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలోనైనా అన్యాయానికి గురైన పరకాల బాగుపడుతుందనుకుంటే జరుగుతున్న పరిణామాలు దయనీయంగా ఉన్నాయన్నారు. భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కావడం, అక్కడే రెవెన్యూ డివిజన్ కేంద్రం కూడా మంజూరు కావడంతో పరకాలలో ఇనే్నళ్ళు అనుబంధం ఉన్న చుట్టు ప్రక్కల రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, గణపూర్, భూపాలపల్లి మండలాలు మన నుండి విడగొట్టబడటంతో నేడు పరకాల వరంగల్ చిత్ర పటంలో ఒంటరిగా మిగిలి పోయేటట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాలను వరంగల్ డివిజన్‌లోకి మార్చడం వల్ల పక్కనున్న మండలాలు భూపాలపల్లి జిల్లాలో కలువడం వల్ల పరకాలలో సబ్ డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల మనుగడ ప్రశ్నార్థకం కానుందన్నారు. కోర్టులు, డిఎస్‌పి, ఎక్సైజ్, విద్యుత్, వ్యవసాయ డివిజన్ కేంద్రాలు వేరే ప్రాంతానికి తరలి పోయే ప్రమాదముందన్నారు. ఎంతో కిర్తి ఘటించిన పరకాల మారుమూల ప్రాంతంలోని చిన్న మండలం స్థాయికి దిగజారే పరిస్థితులు కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో పరకాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్న టిఆర్‌ఎస్ ఇప్పుడు దానికి విరుద్దంగా పరకాలను ఏకాకిని చేసి ఈ ప్రాంత ప్రజలను, వ్యాపార వర్గాల మనోభావాలను దెబ్బ తీసి నోట్టో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విజయ ఆగ్రో తిరుపతిరెడ్డి, కొమురారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ...
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఆదివారం ఇనగాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ డివిజన్ కేంద్రం కావాలని పరకాల ప్రాంత బిడ్డల చిరకాల వాంచ అని అన్నారు. వికేంద్రీకరణలో భాగంగా డివిజన్ కేంద్రం కోసం ఎమ్మెల్యే మాటైన మాట్లాడక పోవడం శోచనీయమన్నారు.
ఇంటింట కరపత్రాల పంపిణీ
పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆదివారం పరకాల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పరకాలలో ప్రతి ఒక్కరికి కరపత్రాలు అందించి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో చెన్నోజు బిక్షపతి, మార్క అభినయ్‌గౌడ్ పాల్గొన్నారు.