వరంగల్

ప్రజావాణి మానిటరింగ్‌కు ప్రత్యేక వింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 17: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు తప్పక పాల్గొనాలని, ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదులు నమోదు చేయాలని అధికారులకు కలెక్టర్ అమ్రపాలి ఆదేశించారు. సోమవారం జిల్లాల విభజన అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అమ్రపాలి ప్రజలనుండి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును, దరఖాస్తులను మానిటరింగ్ చేయడానికి కలెక్టరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించండం జరుగుతుందని అన్నారు. ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా ట్రాకింగ్ నిర్వహిస్తూ సంబందిత శాఖలకు పంపించడం జరుగుతుందని వివరించారు. అట్టి దరఖాస్తులను పూర్తి స్థాయిలో విచారించి, పరిష్కరించి కలెక్టరేట్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే సమస్యలను అంశాలను ప్రతీది రికార్డు చేయడం జరుగుతుందని, ప్రతి సోమవారం అధికారులు విధిగా ప్రజావాణిలో పాల్గొని, గడిచిన వారంలో వచ్చిన దరఖాస్తులను ప్రతి సోమవారం ప్రజావాణి ముగిసిన తర్వాత సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో ఏ శాఖకు సంబంధించి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వస్తాయో ఆయా శాఖల అధికారులు విధిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. హాజరుకాలేని పరిస్థితిలో ముదస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అలసత్వానికి తావు ఇవ్వరాదని కలెక్టర్ అన్నారు.