వరంగల్

ధర్మాన్ని మరవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, నవంబర్ 4:చట్టాలు కఠినంగా ఉన్నా ఉద్యోగ ధర్మాన్ని మరవ కూడదని, సంపద కంటే వ్యక్తిత్వ విలువలే మానవులను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లుతాయని ఉత్తర తెలంగాణ జైళ్లశాఖ డిఐజి కేశవనాయుడు అన్నారు. శుక్రవారం లాల్‌బహదూర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సత్యపరమేశ్వర్ అధ్యక్షతన అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అనే అంశంపై ఒకరోజు సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశవనాయుడు మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటైన అతిపెద్ద సమస్య అవినీతి అని తెలిపారు. అవినీతి నిర్మూలనకు ఎకైక సాధనం యువతనే అని గుర్తుచేశారు. సమాజగతిని, స్థితిని మార్చగల ధైర్యసాహాసాలు, యుక్తులు యువతలో, విద్యార్థులలో ఉన్నాయని అన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ ఏర్పాటు ద్వారా దేశంలో అవినీతి నిర్మూలించంలో ఈ గర్ననెన్స్ విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. నేడు అవినీతికి రహిత సమాజంలో కోసం అందరం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన అవినీతి తగ్గిందని, ప్రజలు అవినీతి నిర్మూలించడంలో ఐక్యంగా ఉంటే ఇంకా ఎన్నో విజయాలు సాధించవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో అద్యాకులు డా.రాజేందర్‌రెడ్ది, డా.సదానందం, డా.విజయ్‌కుమార్, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.