వరంగల్

వారం రోజుల్లో ఒకే ఒక్క రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి,నవంబర్ 15: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌తో గడిచిన వారం రోజులలో భీమదేవరపల్లి మండల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భూములకు సంబందించిన ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ అయినట్లు భీమదేవరపల్లి స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ అధికారి ఎండి. మక్సూద్ అలీ మంగళవారం తెలిపారు. భీమదేవరపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్ మండలాలు ఉన్నాయి. గడిచిన వారంలో కేవలం 11 వేల రూపాయల ఆదాయం రిజిస్ట్రేషన్‌ల ద్వారా సమకూరినట్లు తెలిపారు. కాగ నవంబరు ఒకటవ తేదీనుండి 8 వ తేదీ వరకు పాత నోట్లు తీసుకునే సమయంలో కేవలం ఏడు రోజుల్లో 13 రిజిస్రేషన్ ల ద్వారా 2లక్షల60 వేలు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.

స్థానిక సమస్యలను
తక్షణమే పరిష్కరించాలి
కురవి, నవంబర్ 15: ప్రజా సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని, హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలను విస్మరించిందని మహబూబాబాద్ సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అన్నారు. స్థానిక సమస్యలని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కురవి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పిట్టల వెంకన్న అధ్యక్షతన మంగళవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ...గ్రామాలలో విద్య, వైద్యం, వౌళిక సదుపాయాలను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజన తండాల్లో, దళిత కాలనీలలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదలకు వైద్యం అందక కార్పోరేట్ ఆస్పత్రుల దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. అధికారులు తక్షణమే స్పందించి దళిత, గిరిజన తండాలలో హెల్త్‌క్యాంపులు నిర్వహించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.