వరంగల్

దొంగ నోట్ కాదు.. కలర్ జిరాక్సు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురవి, నవంబర్ 15: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి పెట్రోల్ బంక్‌లో దొరికిన దొంగనోట్(జిరాక్సునోట్) కేసులో ముద్రించిన జిరాక్సు యజమాని తేజావత్ ప్రమోద్, మార్పిడికి యత్నించిన బానోత్ ప్రదీప్‌లను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. కురవి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సిఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి పెట్రోల్‌బంక్‌లో కురవి మండలం తట్టుపల్లి శివారు చంద్యాతండాకు చెందిన బానోత్ ప్రదీప్ ఆదివారం నూతన రెండువేల నోట్‌ను ఇచ్చి రూ.500 పెట్రోల్ పోయించుకున్నాడు. నోట్‌పై అనుమానం వచ్చిన బంక్ నిర్వహకులు మేనేజర్ రహీం దృష్టికి తీసుకువెల్లగా, అది అసలు నోట్‌కాదని..జిరాక్సుగా గుర్తించారు. మేనేజర్ రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మంగళవారం ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో కురవి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్న మరనాథ జిరాక్సు సెంటర్ నిర్వహకుడు తేజావత్ ప్రదీప్ కొత్త రెండు వేల నోట్లను నాలుగు తీసి తనకు ఒకటి ఇచ్చి మార్పించుకుని రమ్మని చెప్పాడని ప్రదీప్ తెలిపారు. వచ్చిన వాటిలో చెరిసగం పంచుకుందామని ఆశతో పెట్రోల్‌బంక్‌కు ప్రదీప్ వెల్లాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో, నూతనంగా వచ్చిన రెండువేల నోట్ ఇంకా ప్రజలల్లోకి వెల్లనందున వీటిని మార్చడం తేలిక అవుతుందని అందుకే జిరాక్సు తీసినట్లు మరనాథ జిరాక్సు సెంటర్ నిర్వహకుడు తేజావత్ ప్రమోద్ ఒప్పుకున్నట్లు తెలిపారు. జిరాక్సు తీయబడిన కలర్‌జిరాక్సు మిషన్, ప్రమోద్ వద్ద ఉన్న మరో మూడు జిరాక్సు రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టుచేసి, కోర్టుకు పంపినట్లు తెలిపారు. రాష్టమ్రంతా కలకలం సృష్టించిన దొంగనోట్ కాస్త..ఆకతాయిలు తీసిన జిరాక్సు నోట్‌గా తెలవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కురవి ఎస్సై టి.అశోక్, మహబూబాబాద్ ఎస్సై పి.జితేందర్, సిబ్బంది జాకిర్, ప్రకాష్, తారాచంద్ తదితరులు పాల్గొన్నారు.