వరంగల్

బిల్లులు చెల్లించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకుర్తి, నవంబర్ 19: మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు బిల్లులు చెల్లించవద్దని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి భూక్య దల్జిత్‌కౌర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తను గ్రామంలో పర్యటించినప్పుడు మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, అధికారులు సర్వే చేసి బిల్లులను నిలుపుదల చేయాలని ఐబి డిఈ రమేష్‌ను ఆదేశించారు. మార్చి లోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడానికి పనులు వేగవంతం అవుతున్నందున ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు చొరవ చూపి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. గతంలో ఇండ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు రూ.350కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఆన్‌లైన్‌లో లోపాలున్నందున కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్‌రూమ్‌లు అర్హులైన లబ్దిదారులకు అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.4.20కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గానికే కెసిఆర్ చొరవతో ఎక్కువ నిధులు మంజూరవుతున్నట్లు చెప్పారు. స్వచ్ఛ్భారత్ కింద పాలకుర్తి మండలానికి 6061మరుగుదొడ్లు మంజూరైనందున త్వరగా పూర్తయ్యేలా లబ్దిదారులు చొరవచూపాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటిసి బనె్నపాక గణేష్, సొసైటీ చైర్మన్ అడ్డూరి మాధవరావు, మార్కెట్ చైర్మన్ రమాదేవి, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.