వరంగల్

శే్వతార్కుడికి మహాక్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ (కల్చరల్) నవంబర్ 19: కాజీపేటలో కొలువుదీరిన స్వయంభూ శ్రీశే్వతార్కమూలగణపతి దేవాలయ క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని మహాక్షీరాభిషేకాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తులచే పాలను సేకరించిన 108లీటర్ల పాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవాలయ అధికారి రఘు దంపతులు మరియు యాదగిరిగుట్ట ప్రధాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణ శర్మలు ఆలయంలో జరిగిన అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిని దేవాలయ వేదపండితులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన క్షీరాభిషేకంలో పాల్గొని స్వామివారికి వస్త్రాలను సమర్పించారు. పూజానంతరం ఆలయంలో జరిగిన పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనారు. కార్తీక మాసోత్సవంలో భాగంగా సాయంత్రం ఆకాశదీప పూజను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అనంతమల్లయ్య భక్తులకు కార్తీక పురాణ విశేషాలను వివరించారు. తదుపరి పూజాకార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.