వరంగల్

కమనీయం.. సీతారాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, నవంబర్ 19: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం శనివారం ఆలయ ఆవరణలో వైభవోపేతంగా జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో 58మంది దంపతులతో పాటు 35మంది శాశ్వత విరాళ దంపతులు కూర్చున్నారు. అనంతరం వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం కన్నువ పండువగా నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు రాష్ట్ర పర్యాటక చైర్మన్ పేర్వారం రాములు, వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబులు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు పబ్బ ఉపేందర్ గుప్త అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయ ప్రహారీగోడ నిర్మాణానికి ఉపేందర్‌గుప్త రూ.12.50లక్షలు విరాళంగా బ్యాంకులో డిపాజిట్ చేస్తానని చెప్పినట్లు ఆలయ ఇవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఎంపిపి బోయిని శిరీషరాజు, మున్సిపల్ చైర్మన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఎసిపి పద్మనాభరెడ్డి పాల్గొన్నారు.
రాములోరి తిరుకల్యాణ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జనగామ డిసిపి తేజావత్ వెంకన్న నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. వరంగల్ సిపి సుధీర్‌బాబు పోలీసుల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.