వరంగల్

అర్హులందరికీ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో డిఆర్‌ఓ కృష్ణవేణితోపాటు జిల్లా అదికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రామలను విన్నూత్న కార్యాచరణతో అమలు చేసి ప్రజల అభివృద్ధే ద్యేయంగా ముందుకు పోతామన్నారు. కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లాను సరికొత్త తరహాలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు తమ కష్టాలతోపాటు సమస్యలను కూడా గ్రీవెన్స్‌లో పరిష్కరిస్తారనే నమ్మకంతోపిర్యాదులు చేసుకుంటున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో ఎక్కువ దరఖాస్తులు వికలాంగుల పెన్షన్‌ల కోరకు వస్తున్నందున వెంటనే సదరన్ క్యాంపు ఏర్పాటు చేసి అర్హులకు పెన్షన్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి గణేష్‌ను అదేశించారు. అర్జీదారుల విన్నపాలను తక్షణమే పరిష్కరించాలని అదేశించారు. ప్రజావాణిలో మొత్తం 235్ఫర్యాదులు అందాయి. ఇందులో వికలాంగుల సదరన్ సర్ట్ఫికెట్‌లు, వృద్ధాప్య పెన్షన్‌లు, డబుల్‌బెడ్‌రూంలు, ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి కోరకు ధరఖాస్తులు అందాయని తెలిపారు.