వరంగల్

‘తేలు’ కుట్టిన దొంగలు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 5: శేఠ్ మీ వద్ద నేను గతంలో తీసుకున్న 10 లక్షల అప్పుతో పాటు మిత్తి లెక్క చేసి తెచ్చినా.. ఇదిగో నగదు తీసుకోండి.. అంటూ ఓ రుణగ్రస్తుడు.. రుణదాత వద్దకు వెళ్లి చేసిన రుణం తీర్చుకోవడానికి వెళ్తే.. అబ్బే ఇప్పుడు వద్దు.. తరువాత తీసుకుంటానని మొండికేసిన అరుదైన ఘటన కేసముద్రంలో బయటపడింది. పాత పెద్ద నోట్ల రద్దుతో పాటు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమలపై ఆదాయ పన్ను శాఖ గట్టి నిఘా పెట్టడంతో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు ‘నల్లకుబేరులు’ తేలు కుట్టిన దొంగల్లా మారి ‘డబ్బు’ మాట వినగానే హడలిపోతున్నారు. విశ్వసనీయ కధనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తను కొంత కాలం క్రితం ఓ వ్యాపారి నుంచి పది లక్షల రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాడు. ఈ మేరకు తాను తీసుకున్న రుణం చెల్లించడం కోసం కనీసం పాతపెద్ద నోట్లు తీసుకోకున్నా సరే.. అప్పుకు తగ్గ నగదుకు చెక్కు ఇస్తా.. నీ బ్యాంక్ ఖాతాలో జమ పెట్టుకో.. అన్నా సదరు రుణదాత ససేమిరా అనడంతో ఈ వ్యవహారం తేల్చాలని రుణగ్రస్థుడు ‘గ్రామ పెద్దల’ను ఆశ్రయించగా.. నీవేమో రుణం తీరుస్తానంటున్నావ్.. ఆయనేమో తీసుకోనంటున్నాడు.. అంటూ ఇరువురి మద్య పంచాయతీ పెట్టారు. నీ వద్ద తీసుకున్న అప్పు చెల్లిస్తానంటే వద్దనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తే.. ‘నేను అప్పిచ్చినపుడు.. అడిగినోళ్లు లేరు.. చెప్పినోళ్లు లేరు.. ఇప్పుడేమో అన్నింటికీ లెక్కలడుగుతరట.. నేనెట్లా లెక్కచెప్పేది.. అందుకే వద్దంటున్నా.. నాకు అవసరం ఉన్నపుడు తీసుకుంటా.. అప్పటిదాకా ఆ పైసలు ముట్టుకోనని’ మొండికేశాడు. దీనితో చేసేదేమిలేక పెద్దలు అప్పటి వరకు ఆ డబ్బుకు ఇక నుంచి ‘మిత్తి’ మినహాయించాలని తీర్మానించారు. మిత్తి లేకుండా 10 లక్షలు తిరిగి వినియోగించుకునే వెసులుబాటు దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తూ రుణగ్రస్థుడు ఇంటిదారి పట్టాడు. కేసముద్రంలో ఇలాంటి నల్ల కుబేరులు చాలామంది ఉన్నారని.. ఆదాయపన్ను శాఖ అధికారులు కాస్త ‘నజర్’ పెడితే వీరి అక్రమ సంపాదన బాగోతం వెలుగుచూసే అవకాశం ఉందంటున్నారు. కాగా ఈ ఘటన పక్షం రోజుల క్రితం జరగగా.. ఆ నోట.. ఈ నోట బయటకు పొక్కి మండల కేంద్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇలాంటి నల్లకుబేరులు కేసముద్రంలో అనేక మంది ఉన్నారని ప్రచారం సాగుతోంది. పాతపెద్ద నోట్ల రద్దు తరువాత వాటిని ఎలా చెలామణి చేసుకోవాలో తెలియక.. బయటకు చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారని ప్రచారం సాగుతోంది.

ప్రజావాణి ఫిర్యాదులను
సత్వరమే పరిష్కరించాలి
వడ్డేపల్లి, డిసెంబర్ 5: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అర్బన్ కలెక్టర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ దయానంద్‌తో కలసి ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం ఫిర్యాదుల పరిష్కారానికి వెంటవెంటనే చర్యలు తీసుకుని, సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. గత సోమవారం ప్రజావాణికి 72శాఖలకు సంబంధించి 807 ఫిర్యాదులు రాగా, ఇప్పటి వరకు 463 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 319 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. అదేవిదంగా రూరల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ హరిత ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కరణలు ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజావాణికి జిల్లా స్థాయి వరకు రాకుండా స్థానిక మండలంలో నిర్వహిస్తున్న స్రజావాణిలో అర్జీ చేసుకోవాలని, అక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.