వరంగల్

పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయింనగర్, డిసెంబర్ 5: వరంగల్ నగరంను హెరిటేజ్ సిటీగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గిరిజన పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. సోమవారం హరితహోటల్‌లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల టూరిజం అభివృద్ది సంస్థ బోర్డు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక కేంద్రాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసి దేశదేశాలనుండి పర్యాటకులను రప్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హెరిటేజ్, స్మార్ట్, హృదయ్ పథకం కింద ఎంపికైన నగరం చారిత్రాత్మకంగా ప్రసిద్దిగాంచిందని ఈ నగరాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందే విధంగా చర్యతీసుకోవాలన్నారు.

కల్యాణ వైభోగమే
వరంగల్ (కల్చరల్), డిసెంబర్ 5: వరంగల్‌లోని శ్రీ్భద్రకాళీ భద్రేశ్వరుల దేవాలయ క్షేత్రంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కాలసర్పజననశాంతి యాగంలో భాగంగా సోమవారం సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం వైభోగంగా జరిగింది. ఆలయ అర్చకులు నాగరాజశర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి నిత్యాహ్నికం నిర్వహించి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, అథోముఖలు కలిగియున్న సుబ్రహ్మణ్యస్వామికి వివిధ రకాల పుష్పాలతో, పంచామృతం, నవవిధ ఫలరసాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఆరు వేరువేరు సహస్రనామాలతో సహస్రనామార్చన చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను నయనానందకరంగా అలంకరింపజేసి ఆలయంలో నిర్మించిన కల్యాణ వేదికపై ప్రతిష్ఠించారు. తదుపరి అలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కాలసర్పజనన శాంతి యాగం పరిపూర్ణం చేస్తు పూర్ణాహుతి నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన కల్యాణోత్సవం తిలకించిన భక్తులు తన్మయత్వం పొందారు. ఈ సందర్భంగా భద్రకాళీ శేషు మాట్లాడుతూ తెలంగాణ గోదావరి నదీ పరివాహక ప్రాంతలలో వరంగల్ ఖమ్మం జిల్లాల మధ్యలో అగస్త్యాశ్రమం ఉన్నదని సుబ్రహ్మణ్యస్వామి మంత్ర చందస్సును వివరిస్తూ.. ఈ మంత్రానికి అగస్త్యుడే ఋషి అని భక్తులకు తెలిపారు. ఈ ప్రాంతాలలో లోక రక్షకుడైన సుబ్రహ్మణ్యస్వామి ఉపాసన ఎంతో శక్తిని కలిగిస్తుందని భక్తులకు సుబ్రహ్మణ్య మంత్ర మహత్యం గురించి వివరించారు. ప్రపంచాన్ని కాలసర్పయోగం పట్టి పీడిస్తుందని ప్రాణకోటిని రక్షించగల శక్తి సుబ్రహ్మణ్యస్వామికి ఉందని, అందుచేతనే భద్రకాళీ దేవాలయంలో ఈ సుబ్రహ్మణ్య యాగ సహిత కల్యాణోత్సవం ప్రజా శ్రేయస్సును క్షేమాన్ని కోరుతు భక్తిశ్రద్ధలతో ఈకార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వేదపండితులు అగ్నిచిత్ ప్యూడపౌండరీక యాజి వెంకటేశ్వరులు మాట్లాడుతు ఈ యాగం వలన సకల జనులు ఆరోగ్య, ఐశ్వర్యాలతో ఉంటారని, ప్రభుత్వపాలకులకు, పంటలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని సశాస్ర్తియంగా ఈ యాగాన్ని నిర్వహించారని యాగ విశేషాలను తెలుపుతు భక్తులకు అనుగ్రహభాషణం చేశారు.