వరంగల్

సాంకేతిక బోధనా ఉపాధ్యాయులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట,డిసెంబర్ 8: దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులు ఏలాంటి శిక్షణ లేకుండానే ఉపాద్యాయ వృత్తిలోకి వస్తున్నారని, దీంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రొఫెసర్ బర్రీ స్పాండర్ అన్నారు. గురువారం వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో టీచింగ్ లర్నింగ్ సెంటర్ అధ్వర్యంలో మూడు రోజుల సెమినార్ ప్రారంభ సమావేశం జరిగింది. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జిఆర్‌సి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా స్పాండర్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులు పరిశోధనల వైపు వెళ్లక పోవడానికి, ఉపాద్యాయులు సరియైన అవగాహన కల్పించకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ పాఠాలు బోధించే అద్యాపకులు ఏలాంటి ప్రాధమిక శిక్షణ కూడా లేకుండానే, ఉపాద్యాయ వృత్తిని చేపడుతున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల వలన వారు బోధనలో ఇబ్బందులు పడడమే కాక, విద్యార్థులకు అవగాహన కల్పించలేకపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల నుండి మన దేశ విద్యా వ్యవస్థ బయట పడాలని, ఉపాద్యాయులుకు సరియైన శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి, శిక్షణ ఇప్పించి తర్వాతనే తరగతి పంపే వ్యవస్థరావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ వైఎన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాద్యాయులకు ఎంతో విలువైన సెమినార్‌ను నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉపాద్యాయులు ఎంత జ్ఞానార్జన చేస్తే, అంత మంచి ఉపాద్యాయునిగా గుర్తింపు పొందడమేకాక విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దవచ్చునని వివరించారు. మూడు రోజులపాటు జరిగే ఈ సెమినార్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 67 మంది విశ్వవిద్యాలయ అద్యాపకులు పాల్గొననున్నారు.

డిజిటలైజేషన్‌తో నాణ్యమైన ప్రసారాలు
బిల్ట్ డిజిఎం
మంగపేట, డిసెంబర్ 8: డిజిటలైజేషన్ ద్వారా కేబుల్ టివి వినియోగదారులు నాణ్యమైన ప్రసారాలు పొందగలరని బిల్ట్ హెచ్‌ఆర్ డిజిఎం కేశవరెడ్డి అన్నారు.
మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలలోని కేబుల్ టివి వినియోగదారులకు మరింత నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు కమలాపురంలో ఏర్పాటు చేసిన శ్రీ సమ్మక్క - సారక్క డిజిటల్ కంట్రోల్ రూంను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా డిజిఎం కేశవరెడ్డి మాట్లాడుతూ కేబుల్ టివి ప్రసారాలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా డిజిటల్ ఇండియా నినాదం మారుమూల పల్లెల చెంతకు చేరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు శ్రీసమ్మక్క - సారక్క కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. కేబుల్ టివి వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన ప్రసారాలు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిల్ట్ పర్సనల్ మేనేజర్ పి.రఘుపతిరెడ్డి, వరంగల్ కోవా ఎంఎస్‌ఓ బాబీ, కమలాపురం ఎంఎస్‌ఓ జెకె.శర్మ, మాజీ ఎంపిటిసి ఎల్.శ్యాంలాల్, టెక్నీషియన్లు సారధి, కిషన్, ఎన్.శ్రీను, టి.మాధవాచారి, యు.నాగేశ్వరరావు, రమేష్, ప్రభాకర్, నరేష్ పాల్గొన్నారు.

సన్నరకం ధాన్యానికి మద్దతు ధర రూ.2100 చెల్లించాలి
టిడిపి ధర్నా
ములుగుటౌన్, డిసెంబర్ 8: రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.2100లు, దొడ్డురకం ధాన్యానికి రూ.1510లు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ టిడిపి మండలపార్టీ అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజి ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూయ(సీతక్క) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ధర్నాలుండవని చెప్పిన సిఎం కెసిఆర్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యం పెద్ద మొత్తంలో నిల్వ ఉందని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని, అంతేకాకుండా మద్దతు ధర సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2100లు, దొడ్డురకం ధాన్యానికి రూ.1510లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సుమారు రెండుగంటలపాటు జరిగిన ధర్నాతో రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో తహసిల్దార్ ములుకనూరి శ్రీనివాస్, స్థానిక ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్‌లు చేరుకున్నారు. ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సన్నరకం ధాన్యాన్ని ఐకెపి, పిఎసిఎస్‌ల ద్వారా కొనుగోలు చేసేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీతక్కతోపాటు నాయకులు, రైతులు తహసీల్దార్‌కు అందజేశారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు సమ్మిరెడ్డి, దేవరనేని స్వామిరావు, ముసినపల్లి కుమార్‌గౌడ్, పైడిమల్ల శత్రజ్ఞుడు, ఆకుతోట చంద్రవౌళి, రైతులు మోహన్‌రెడ్డి, మామిడి శంకర్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా పల్లివేట
అయ్యప్పల శరణుఘోషతో మార్మోగిన నర్సంపేట

నర్సంపేట, డిసెంబర్ 8: స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల శరణుఘోషతో నర్సంపేట పట్టణం గురువారం మారుమ్రోగింది. పల్లి వేట కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పట్టణంలోని శ్రీ్ధర్మశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మణికంఠస్వామిని చతురంగ బలాలతో పుంగావణం వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. తొలుత అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు బస్టాండ్ అంగడి, అంబేద్కర్, పాఖాల జయలక్ష్మీ సెంటర్‌ల మీదుగా నగర పంచాయతీ కార్యాలయం వరకు కొనసాగింది. పల్లకి (రథం)పై అయ్యప్పను అలకరించిన అయ్యప్ప మాలాధర స్వాములు ఊరేగింపుగా పుంగావనం (నగర పంచాయతీ కార్యాలయం వనం)కు బయలుదేరారు. దారి పొడవునా భక్తులు ఎదురేగి అయ్యప్ప దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయ్యప్ప స్వాములు విచిత్ర వేషధారణలతో ఉత్సాహాంగా పాల్గొన్నారు. చెట్ల ఆకులతో అయ్యప్పకు అలకరించి పూజలు చేశారు. అనంతరం జంతువుల వేట (క్షేత్రబలి)ని నిర్వహించారు. పుంగావనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మణికంఠస్వామిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అభిషేకం, హారతి తదితర పూజా కార్యక్రమాలను వేలాది మంది భక్తులు తిలకించి పరవశులయ్యారు. కేరళకు చెందిన పూజారి కె.పద్మనాభన్ నంబూద్రి గురు స్వామీ పూజాధి కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణల మద్య వైభవంగా నిర్వహఙంచారు. ఈవేడుకల్లో ఆలయ కమిటి చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, డిఎస్‌ఆర్ మూర్తి, శ్రీరాం ఈశ్వరయ్య, మాధారపు చంద్రశేఖర్, చింతల నిరంజన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఖానాపురం ఎంపిపి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కౌన్సిలర్లు చింతల సాంబిరెడ్డి, గంధం వరలక్ష్మీ సాంబయ్య, పుల్లూరి స్వామి సంధ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్, కోలా మహేందర్, వ్యాపార ప్రముఖులు దొడ్డా రవీందర్, చకిలం క్రిష్ణమూర్తి, నందయ్య, బాబురావు, గురుస్వాములు పానుగంటి శ్రీనివాస్‌గౌడ్, వెంకట్రాజం, సంజీవరావు, భాస్కర శర్మ తదితరులు పాల్గొన్నారు.

తండాల్లో నిఘా పెంపు

* పక్కా ప్రణాళికతో సంపూర్ణ గుడుంబా నిషేధం * ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను
భాగం చేయాలి * పునరావాసానికి హామీ * ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబాబాద్, డిసెంబర్ 8: మహబూబాబాద్ జిల్లాలో గుడుంబాను సంపూర్ణంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్, పోలీస్, రెవిన్యూ అధికారులు పక్కా ప్రణాళికతో కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమీషనర్ ఆర్ వి చంద్రవదన్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ చాంబర్‌లో గురువారం గుడుంబా నిర్మూలనపై జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ ఎస్ ఎ అజయ్‌రావు, ఒ ఎస్ డి ఎం ఎం షారుక్, డిప్యూటీ కమీషనర్ ఆర్ సురేష్, డి ఎఫ్ ఓ వేణుమాధవ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రావులతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రవదన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కఠినమైన చర్యలు చెపడుతున్నప్పటికీ గ్రామాల్లో గుడుంబా పూర్తిగా నివారించబడడం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పదహారు మండలాల్లో 847 తండాలు ఉన్నాయని, తండాల్లో గట్టి నిఘా ద్వారా గుడుంబాను పూర్తిగా అరికట్టవచ్చని అన్నా రు. ఉమ్మడి జిల్లాలో 90శాతం గుడుంబాను నిర్మూలించామని, నూతన జిల్లా పరిధి చిన్నదైనందున ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుడుంబాను సంపూర్ణంగా అరికట్టేందుకు పకడ్బంది కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, వి ఆర్ ఎ, మహిళా సంఘాల ప్రతినిధులతో కమిటీలు వెయ్యాలన్నారు. గుడుంబా వృత్తిని విడనాడిన వారికి ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. గుడుంబా తయారి, విక్రయ దారులపైన కఠిన చర్యలు చెపట్టి పిడి యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆకస్మిక దాడులు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో నివసిస్తున్న విద్యావంతులు గుడుంబా వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి చైతన్యం కల్పించాలని కోరారు. జిల్లాలోని అన్ని మధ్యం దుఖాణాల్లో స్వైప్ మిషన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రానికి 10కిలో మీటర్ల దూరంలో సారా డిపో స్థాపించడానికి, జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఏర్పాటుకు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కెటాయించవలసిందిగా కమీషనర్ చంద్రవదన్ కలెక్టర్‌ను కోరారు. హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా అందరు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి వై వి గణేష్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్డీవొ భాస్కర్‌రావు, మహబూబాబాద్ తొర్రూరు, గూడురు ఎక్సైజ్ సీఐలు తిరుపతి, చంద్రశేఖర్, చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసుల్లో రికవరీపై

ప్రత్యేక శ్రద్ధ

పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు

వరంగల్, డిసెంబర్ 8: వివిధ సమస్యలపై పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తే పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని వరంగల్ పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు తెలిపారు. వివిధ చోరీ కేసుల్లో ఆస్తుల రికవరీకి పోలీసు యంత్రాంగం ప్రత్యేకశ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. గురువారం పోలీసు కమీషనరేట్ మీటింగ్ హాలులో కమీషనరేట్ పరిధిలోని డిసిపిలు, ఏసిపిలు, ఇన్‌స్పెక్టర్లతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమీషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతు కమీషనరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో షీటీంలు, ఇంటర్‌సెప్టార్ వాహనాల ఏర్పాటుతో నేరాలు, ఈవ్‌టీజింగ్ చాలా తగ్గిందని చెబుతు, ఈ వ్యవస్థను మరింత విస్తృత చేయవలసిన అవసరం ఉందని, కొత్త ప్రాంతాలకు దీనిని విస్తరించవలసి అవసరం ఉందని చెప్పారు. నేరాలు జరిగిన సందర్భంలో నేరస్తులను గుర్తించేందుకు, నేరాలు జరగకుండా జాగ్రత్త పడేందుకు ఉపయోగిస్తున్న సిసి కెమెరాల వినియోగం మరింతగా పెరగాలని చెబుతు, పరకాల, నర్సంపేట, జనగామ ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అక్కడి ఏసిపిలకు కమీషనర్ సూచించారు. కమీషనరేట్ పరిధిలో కార్టన్ సెర్చ్‌లు విస్తృతంగా చేపట్టాలని, దీనివల్ల నేరస్తులతోపాటు వారికి ఆశ్రయం ఇస్తున్న వ్యక్తుల సమాచారం బయటపడుతుందని అన్నారు. కమీషనరేట్ పరిధిలో కొత్త ఏర్పాటవుతున్న కాలనీలలో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని చెప్పారు. ఇటీవల సెంట్రల్ జైలునుంచి ఖైదీలు పారిపోయిన సంఘటనతోపాటు గతంలో జరిగిన వివిధ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని జైలు ప్రాంతంలో పెట్రోలింగ్ విస్తృత స్థాయిలో కొనసాగించాలని తెలిపారు. పెట్రోలింగ్ విధులు నిర్వహించే అధికారులు ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, అధికారుల భద్రతకోసం ఏర్పాటుచేసిన సెక్యూరిటీ సిబ్బంది పనితీరును గమనించాలని సూచించారు. కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో భాగంగా రోడ్లకు ఆనుకుని ఏర్పాటుచేసిన దుకాణాలను, వ్యాపారులు ఏర్పాటుచేసిన సైన్‌బోర్డులు, ప్లెక్సీలను తొలగించాలని పోలీసు అధికారులను ఆదేవించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారి కఠినంగా వ్యవహరించటం ద్వారా ప్రమాదాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు వేణుగోపాల్‌రావు, ఇస్మాయిల్, వెంకన్న, ఏసిపిలు మురళీధర్, జనార్ధన్, మహేందర్, ఈశ్వర్‌రావు, సుధీంద్ర, మురళీధర్, పద్మనాభారావు, రమేష్‌కుమార్ పాల్గొన్నారు.

శివారు కాలనీలు,
మురికివాడల్లో

బహిరంగ మలవిసర్జన నిరోధిద్దాం

వరంగల్, డిసెంబర్ 8: వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ మలవిసర్జన అధికంగా జరుగుతున్న కాలనీలు, మురికివాడలపై అధికారులు ప్రత్యేకదృష్టి పెట్టి నివారణకు చర్యలు తీసుకోవాలని నగరపాల సంస్థ కమీషనర్ శృతి ఓజా సూచించారు. గురువారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణంపై వివిధ విభాగాల అధికారులతో ఆమె సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతు నగరంలోని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తిచేందుకు చేపడుతున్న సర్వేను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు. సర్వే ఆధారంగా మరుగుదొడ్లు లేని, బహిరంగ మలవిసర్జన అధికంగా ఉన్న కాలనీల మ్యాపులను సిద్ధం చేయాలని చెప్పారు. సంబంధిత కార్పొరేటర్లు, ఎన్జీఓల సహకారంతో బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా కలిగే నష్టాలను, మరుగుదొడ్ల అవసరాలను ప్రజలకు వివరించి చైతన్యపరచాలని అన్నారు. మలవిసర్జన రహిత నగరంగా మార్చేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. నగరంలో ప్రతి కాలనీలో పందుల సంచారం ఎక్కువగా ఉందని తన తనిఖీల సందర్భంగా తెలిసిందని, దీనివల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె చెప్పారు. పందుల పెంపకం నగర శివారులకు తరలించేలా యజమానులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. పందుల పెంపకం మాత్రమే జీవనోపాధిగా ఎంచుకున్న వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలి మెప్మా అధికారులను ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇకనుంచి ప్రతి వాణిజ్యపరమైన కాంప్లెక్సులు, షాపుల వద్ద సొంతగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకోవాలని తెలపాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేసేవారికి నోటీసులు ఇచ్చి జరిమానాలు వేయాలని స్పష్టం చేసారు. నగరంలో ఇప్పటికే నాలుగు ప్రదేశాలలో గుర్తించిన డంపింగ్ యార్డులకు అవసరమైన స్థలాన్ని అడ్వాన్స్ పొజిషన్‌కు ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని కోరాలని అధికారులకు సూచించారు. నగరంలో దోమల నివారణకు ఆశించిన మేర చర్యలు తీసుకోవటం లేదని చెబుతు, ముఖ్యంగా స్ప్రే కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిర్ధేశించిన మేరకు జరగటం లేదని తెలిపారు. ప్రతిరోజు తాను క్షేత్రస్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలతోపాటు దోమల నివారణ కార్యక్రమాలను పరిశీలిస్తున్నానని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజారెడ్డి, బయాలజిస్ట్ సంధ్య పాల్గొన్నారు.

నేడు టిఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి పోరు

నక్కలగుట్ట,డిసెంబర్ 8:తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ప్రారంభించాలని తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్ నాయకులు తలపెట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభిచాలనుకున్నా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి గర్జనను ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనానికి మార్చారు. గురువారం సాయంత్రం హుటాహుటిన ఏర్పాట్లను చేయడానికి టిడిపి విద్యార్థి నాయకులు ఏకశిలాపార్కుకు చేరుకుని ఏర్పాట్లను చేయడం కనిపించింది. రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తదితర నాయకులు హాజరుకానున్నారని విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ సంతోష్ నాయక్ ఆరోపించారు. ప్రభుత్వం కక్ష్య కట్టి కనీసం విశ్వవిద్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. విశ్వవిద్యాలయంలో సభను నిర్వహిస్తే తెరాస నిజస్వరూపం విద్యార్థులకు తెలుస్తుందనే భయంతోనే అనుమతి రాకుండా తెరాస నాయకులు చేశారని విమర్శించారు.ఈ సభతో ప్రభుత్వానికి కనువిప్పుకలిగేలా చేస్తామని టిడిపి శ్రేణులు చెపుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వలన విద్యార్థులు సమయానుకూలంగా పరీక్షలు కూడా రాయలేని దుస్థితి రాష్ట్రంలో ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ విద్యార్థి పోరు ఆగదని అన్నారు. పబ్లిక్ గార్డెన్ నుండి ఏకశిలాపార్కు వరకు భారీ ర్యాలీ, అనంతరం జయశంకర్ స్మృతి వనంలో బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నగరంలో పారిశుద్ధ్యంపై
కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

వడ్డేపల్లి,డిసెంబర్ 8: నగరంలో గత కొంత కాలంగా నగర పాలక సంస్థలో ఇంచార్జి కమీషనర్ పాలనలో కొనసాగుతున్న షాహీద్ మహమూద్ బదిలీపై వెళ్లడంతో, నూతన కమీషనర్‌గా శృతి ఓఝా నియమితులై నగర పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం వేకువ జామున నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ద్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే మాధిరెడ్డి కుంట, జన్మభూమి జంక్షన్, ఏకశిలానగర్, సాకరాసికుంటలలో అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నగరంలో పారిశుద్ద్యంపై క్షేత్రస్థాయిలో పనులు జరిగే విధంగా కార్మికులు పనిచేయాలని అన్నారు. పారిశుద్ద్య కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు ఇక నుండి వేకువ జాముననే తనిఖీలు నిర్వహిస్తానని, విధి నిర్వహణలో అలసత్వం వహించే కార్మికులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఆమె వెంట డిప్యూటి కమీషనర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించండి
వడ్డేపల్లి, డిసెంబర్ 8:నగరంలోని శిథిలావస్థకు చేరిన ప్రమాదకరంగా పరిణమించిన భవనాల ముందు ప్రమాద హెచ్చరిక సంకేత సూచికలను వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్ శృతి ఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిటీ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నగరంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేసి, కూల్చివేయాలని అన్నారు. నాళా అక్రమాల గుర్తింపుకై చేపట్టిన సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాళా అక్రమాలుగా గుర్తించిన వివాదరహిత, పూర్తి వాణిజ్య, ఎస్టాబ్లిష్‌మెంట్‌ను గుర్తించి కూల్చివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్‌నాయక్, ఎసీపీలు రవి, గణపతి, శైలజ, శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.