వరంగల్

కెటికె-5 గనిలో లాంగ్‌వాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 18: జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేటికే-5 గనిలో లాంగ్‌వాల్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సింగరేణి యాజమాన్యం తాజాగా రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం టెండర్లు అహ్వానించే ప్రక్రియను ప్రారంభిస్తోంది. భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు సింగరేణి యాజమాన్యం లాంగ్‌వాల్ విధానంపై దృష్టి సారించింది. ఇటీవల కాలంలో మార్కెట్ పెరగడంతో ఉత్పత్తి పెంపు అత్యంత అధునికమైన లాంగ్‌వాల్ విధానంతోనే సాధ్యమని సంస్థ భావించి భూపాలపల్లి జిల్లాలోని కేటికే-5 గనిలో అమలులోకి తేవడానికి కసరత్తు ప్రారంభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటికే -5 గనిలో లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన సింగరేణి రూ. 500 కోట్లతో టెండర్లు అహ్వానిస్తుంది. భూపాలపల్లి కేటికే-5 గనితో పాటు మున్ముందు కేటి 1,2,3 గనుల్లోనూ లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్దం చేసి యాజమాన్యంకు అందచేశారు. అయితే సింగరేణి వ్యాప్తంగా ప్రత్యేకంగా అధ్యాయనం చేసి లాంగ్‌వాల్ విధానానికి సాంకేతికంగా అనుకూలంగా ఉంటుందో వాటిలో మాత్రమే ప్రవేశ పెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. సింగరేణి కేటికే-5లో ప్రవేశ పెట్టే లాంగ్‌వాల్ విధానంతో పదహారు సంవత్సరాలకు పైగా ఈ పద్దతితో బొగ్గు ఉత్పత్తి చేపట్టడానికి ప్రణాళిక సిద్దం చేశారు. అయితే 1800 కోట్లతో అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసిన సింగరేణి యాజమాన్యం ఆ గని ద్వారా ఏటా 2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుందని అధికార వర్గాల సమాచారం. దేశంలోనే అతి పెద్ద సాంకేతిక పరిజ్ఞానం అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌దేనని అధికారులు పేర్కొంటున్నారు.
121 లక్షల టన్నుల బొగ్గు వెలికితీత
భూపాలపల్లిలోని కేటికే -5 గనిలో 121 లక్షల టన్నుల బొగ్గును లాంగ్‌వాల్ విధానంతో వెలికి తీసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇటీవల కాలంలో సింగరేణి మార్కెట్ పెరగడంతో బొగ్గు ఉత్పత్తి పెంపు కోసం అత్యంత అధునీకరమైన లాంగ్‌వాల్ విధానంతో సాధ్యమని సంస్థ భావించి కేటికే-5 గనుల్లో అములులోకి తేవడానికి కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఏటా 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న ఇందులో భూగర్భ గనుల నుండి 30శాతం మాత్రమే యాజమాన్యం తీయగలుగుతుంది. రానున్న కాలంలో ఉపరితల గనులకు ధీటుగా భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచేందుకు కొత్తగా లాంగ్‌వాల్ విధానం కేటికే-5 గనుల్లో అములుల్లోకి తేనున్నారు. లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి ద్వారా సింగరేణికి ఆదాయం పెరగనుంది.
లాంగ్‌వాల్ విధానంపై దృష్టి.
లాంగ్‌వాల్ విధానంపై సింగరేణి యాజమాన్యం దృష్టి సారించింది. భూగర్భంలో ఉన్న బొగ్గును ఏలాంటి పేలుళ్లు లేకుండా బయటకు తీసేందుకు లాంగ్‌వాల్ విధానాన్ని వినియోగిస్తారు. నేరుగా బొగ్గు పొరకు లాంగ్‌వాల్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దానికి ఉన్న పెద్ద చక్రంతో బొగ్గు పొరను తొలుచుకుంటూ వెళ్లుతుంది. బొగ్గు పొరను తొలగించడం ద్వారా వెలికి వచ్చిన బొగ్గు నేరుగా బెల్ట్‌పై పడుతుంది. అక్కడ నుండి కనే్వయర్ బెల్ట్ ద్వారా ఉపరి తలానికి చేరుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే లాంగ్‌వాల్ విధానంతో ఎక్కువగా మానవ వనరుల అవసరం ఉండదు. లాంగ్‌వాల్ యంత్రం వద్ద మైనింగ్, ఎలక్ట్రిషియన్, ఫిటర్, రిమోట్ ఆపరేటర్, పంపు ఆపరేటర్ లాంటి సాంకేతిక సిబ్బంది మాత్రమే పని చేయడానికి అవకాశం ఉండడంతో సింగరేణి యాజమాన్యం లాంగ్‌వాల్‌పై దృష్టి సారించింది. సాధారణంగా భూగర్భ గనుల్లో మానవ వనరులు, ఇతర పరిజ్ఞానంతో చేపట్టిన ఉత్పత్తిలో నష్టాలే ఎక్కువగా ఉన్నాయని సంస్థ భావించడంతో లాంగ్‌వాల్ వైపే మొగ్గు చూపుతుందని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు.