ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? నవంబర్ 6 నుండి 12 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక అసమానతలు మెల్లగా తగ్గుతాయి. అదనపు వనరులకై చేసే ప్రయత్నాలు ఓ మాదిరిగా ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారకి లబ్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అనుకున్న పత్రాలు అందుకుంటారు. ఆందోళనలను దరికి రానీయకండి. చిరువ్యాపారులు, పోటీ పరీక్షదారులు, విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. దేనికైనా ఏకాగ్రత అవసరం. ఈర్ష్యా ద్వేషాలను దరికి రానీయకండి. శుభకార్యాలు కలసి వస్తాయి. సంఘ కార్యాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటారు. పెట్టుబడికై ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఇతరుల సాయంతో అన్నింటా పునాదులు వేస్తారు. స్ర్తిల సాయం మీకు సమయానికి అందుతుంది. అనవసరంగా ఆవేదన చెందకండి. దంపతులు శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితుల వ్యవహారాల్లో మార్గదర్శకత్వం అనుకూలిస్తుంది. రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు రాజీ మార్గం ద్వారా పరిష్కారమవుతాయి. ప్రయాణాలందు అప్రమత్తంగా మెలగాలి. జ్యుయెలరీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్, విదేశీ విద్య, ప్రయాణాలు అనుకూలిస్తాయి. మాటతో సఖ్యత వృద్ధి. ఆగ్రహాన్ని నిగ్రహించుకోండి. అన్నింటా ఆలోచన మేలు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పెళ్లి కానివారికి వివాహ సూచనలున్నాయి. బంధువుల సాయంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. విలువైన వస్తువులతో జాగ్రత్త. తొందర ప్రయాణాలు మంచిది కాదు. ఎత్తుపల్లాలు చూసుకొని నడవండి. ఆరోగ్యం ఇబ్బందుల్లో పడకుండా చూసుకోండి. ఊహించని విధంగా బంధువుల నుంచి సహాయ సహకారాలందుతాయి. ఇతరులను తేలికగా నమ్మి విలువైన వస్తు సామాగ్రి ఇవ్వకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు ఊపందుకుంటాయి. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. విద్య, సాంకేతిక రంగాల వారు ఆశించిన ఫలాలు అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిబద్ధతతో పనులు పూర్తిచేస్తారు. ప్రణాళికతో ముందుకు వెళ్లి ఇతరులకు మార్గదర్శకత్వం వహిస్తారు. శుభకార్యాలు కలసి వస్తాయి. అవివాహితులకు వివాహాలకు అనుకూలం. మిత్రులు బంధువులతో కలిసి ప్రయాణ సూచనలున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశాలున్నాయి. వ్యవహారాలు అవకాశానుకూలంగా పూర్తి చేయగల్గుతారు. ఉద్యోగులకు సిబ్బందితో ఇబ్బందులున్నా సమసిపోతాయి. సమిష్టిగా ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాలందు తృప్తి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
బకాయి పనులు పూర్తి చేస్తారు. మీరు చేసే పనులు హితులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సంబంధీకుల అండతో శుభకార్యాలలో పాల్గొని, గౌరవాన్ని పొందుతారు. సమయానికి పైకం అందుతుంది. వ్యయం పట్ల నియంత్రణ అవసరం. రియల్ ఎస్టేట్ రంగం వారు ఆలోచించి మెలగాలి. కోర్టు వ్యవహారాలు ఉంటే వాయిదా మేలు. విదేశీ, స్వదేశీ ముఖ్య వ్యవహారాలు మెల్లగా పూర్తవుతాయి. విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు విస్తరణకు మార్గానే్వషణ చేస్తారు. అతిగా దేనియందు వ్యవహరించకండి. ఏకాగ్రతే మేలు. విలువైన సామాగ్రి ప్రాప్తి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
సంపద విషయాల్లో అప్రమత్తత వహించాలి. మీ స్వ విషయాలను ఇతరులకు తెలుపకండి. వైవిధ్య కార్యాలందు పాల్గొని పేరు గడిస్తారు. అన్నింటా మీకున్న వనరుల విలువ ఎక్కువవుతుంది. స్పెక్యులేషన్ అనుకూలం. శుభకార్యాలందు ఇతరుల సాయంతో ముందుకు వెళ్తారు. వ్యవసాయ రంగంలో అనుకోకుండా పైకం వ్యయం చేయాల్సి వస్తుంది. శక్తికి మించి అప్పులు తీసుకోవద్దు. ఇవ్వవద్దు. పర్యవేక్షణ, శిక్షణ మీకు అన్నింటా రక్షణగా ఉంటుంది. పనులు ఎలా చేస్తున్నాము అని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వదంతులు నమ్మకండి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
అనుకున్న వ్యవహారాలు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలను సరి చూసుకోవాలి. కచ్చితత్వం పాటించండి. సమయానికి పైకమందుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల సాయం అవసరాన్నిబట్టి అందుతుంది. ఉద్యోగానే్వషకులకు ఉపాథి ప్రాప్తి. పోటీ పరీక్షలందు సానుకూల ఫలితాలుంటాయి. దంపతులు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతారు. అనుకున్న కార్యాలు కుంటుపడినా ఒకందుకు మంచిదే అనుకుంటారు. ఇంటా బయట సమస్యలను ఆహ్వానించకండి. రాజకీయాలు మీకు అవసరమా అన్నది ఆలోచించండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
అనే్వషణ మనస్తత్వంతో కార్యాలు పూర్తి చేస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందంజ వేస్తారు. ఆదాయం రాక ఖర్చుకై పోక తికమకపెట్టవచ్చు. మీకై ఖర్చు చేసుకోండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకండి. అన్నింటా శక్తికి మించి ప్రవర్తించకండి. ఆధ్యాత్మిక, శుభకార్యాలందు మీదైన పద్ధతిలో పాల్గొని విలువలను వృద్ధి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు, వైద్య, వైవిధ్య రంగాల వారికి మెరుగైన ఫలితాలుంటాయి. అనుకోని లాభాలను అందుకుంటారు. ఎదుటివారు మిమ్ములను అన్నింటా గమనించే అవకాశాలు ఇబ్బందికరంగా మారతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
శుభకార్యాలు కలసి వస్తాయి. మాట, రాతలందు జాగ్రత్త వహించాలి. ఇబ్బందికరమైన వాతావరణాన్ని కొని తెచ్చుకోకండి. పైకం ఖర్చులకై సర్దుబాటు, దిద్దుబాట్లు ఉంటాయి. విద్య, వ్యవహార, వైద్య, ఇతర రంగాల వారు శక్తికి మించి పని చేస్తారు. మన్నన ఉంటుంది. రావలసిన ధనం మీకు వచ్చే అవకాశముంది. ఐ.టి. ఇన్‌కంటాక్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంకు వ్యతిరేకంగా వర్తించకండి. నిరుద్యోగులకు మంచి రోజులు. విద్యార్థులు శ్రమకు అనుగుణంగా ఫలితాలందుకుంటారు. బంధువుల సాయం లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
పట్టుదలతోనే కార్యసిద్ధి. బుద్ధి బలంతో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ముఖ్యమైన ఘటనలను కుటుంబ సభ్యులతో కలసి పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. తత్తరపాటుతో పనులు ఆరంభించకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అనుకున్న ఫలితాలను మెల్లగా పొందేట్లున్నారు. స్ర్తి, పురుషులు తోడునీడగా వ్యవహరించి మంచి గుర్తింపును పొందే అవకాశముంది. స్పెక్యులేషన్ స్వల్పంగా లాభిస్తుంది. ఇతరుల ఖర్చులను మీ ఖర్చులనుకోవద్దు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
కుటుంబ సభ్యుల సంతోషంలో పాలుపంచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సంతానం సాయం పడతారు. ఉద్యోగావకాశాలు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం మీద నెరవేరుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయ వనరులు ఫరవాలేదనిపిస్తాయి. సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను అనే్వషించండి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. తగాదాలు వద్దు. పరధ్యానం కూడదు. మీ హద్దుల్లో మీరుంటేనే మంచిది. స్ర్తిలకు దూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపార విస్తరణకు అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇతరుల వ్యవహారాలందు జాగ్రత్తగా ఉండండి. పొగడ్తలకు, తెగడ్తలకు లొంగకండి. మీ శక్తి, బుద్ధికి అనుకూలంగానే పనులు నిర్వర్తించండి. ఆర్థికంగా బలం ఉన్నా, ఇతరుల ప్రమేయంతో ఖర్చులందు ఆలోచన అవశ్యం. స్ర్తి పురుషులు ఆలోచనా దృక్పథంతో ముందుకు వెళ్లండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలందు అప్రమత్తంగా ఉండాలి. తగాదాలు పెట్టేవారిని గుర్తించి దూరంగా ఉంచండి. పదోన్నతికి, బదిలీలకు, ధన సంపాదనకు అవకాశముంది. ప్రణాళికాబద్ధంగా మెలగాలి.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855