ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? మే 8 నుండి 14 వరకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
సరైన నిర్ణయాలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు వాయిదా వేయటం మంచిది. అవసరాలకు తగ్గట్టుగా సమన్వయంతో మెలగండి. ఆరోగ్యం సంతృప్తికరం. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఆందోళనలతో పనులు ప్రారంభించకండి. అన్నింటా స్వీయ పరిశీలన మంచిది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. కొన్ని వార్తలు సంతోషాన్నిస్తాయి. ఆదాయ వ్యయాలు లాభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
బాధ్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలను అధిగమిస్తారు. ఇతరుల పొగడ్తలకు విలువ ఇవ్వకండి. శుభ వర్తమానాలు అందుతాయి. కొన్ని విషయాలు అవగాహనకు వస్తాయి. మెరుగైన పనితనంతో బంధుమిత్రులను ఆకట్టుకొంటారు. గౌరవ మర్యాదలున్నప్పటికీ కొన్ని సంఘటనలు మనస్తాపం కలిగించవచ్చు. పనులు వాయిదా పడతాయి. స్పెక్యులేషన్ లాభించదు. ఖర్చుకి తగినట్టు ఆదాయం ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)
ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదాయ వ్యయాలు అనుకూలం. సంఘంలో మేలు కలిగే పనులు నిర్వహిస్తారు. మన్ననలను పొందుతారు. అధైర్యపడకండి. కుటుంబ సభ్యుల మాటకు విలువనిచ్చి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు తయారుచేసుకుంటారు. విద్య, వ్యాపారాలు నూతనంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్ర్తిలకు మంచి తరుణం. ప్రయాణాలకు సరైన ప్రణాళిక తయారుచేసుకోండి. ఇంట్లో శుభకార్యాలు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆత్మీయులు చేయూత నిస్తారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పరిసరాలు గమనించండి. ఆరోగ్యం సంతృప్తికరం. విందు వినోదాలలో పాల్గొంటారు. చదువులపై శ్రద్ధ వహించండి. దంపతులు అకారణ కలహాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ రంగాల వారు అనుకోని పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
స్వశక్తితో కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు ఉండవచ్చు. ఆదాయ వ్యయాల లావాదేవీలు అనుకున్నట్లుగా ఉండకపోయినా ఖర్చులు చేదాటిపోవు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వారు మిమ్ములను కలిసి ఊహించని బహుమతులు అందజేస్తారు. వృత్తి, వ్యాపార, వైద్య రంగాల వారు అనుకోని సంఘటనలను ఎదురు చూడాల్సి వస్తుంది. పనులందు ఏకాగ్రత అవసరం.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
లక్ష్యాలు సాధిస్తారు. పనితనానికి గుర్తింపు లభించి మన్ననలు పొందుతారు. ఆత్మీయులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార రంగాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కృషికి తగిన లాభాలు పొందుతారు. భయపడుతూ పనులు చేయకండి. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు. వాహన రిపేర్లు ఉంటాయి. సంఘ సేవలో గుర్తింపు. స్ర్తిలకు సంఘంలో విలువ పెరుగుతుంది.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
ఒక పద్ధతి ప్రకారం కార్యాలు పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. కలసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గౌరవ మన్ననలు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు, యాత్రలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు, వార్తలు ఆనందాన్నిస్తాయి. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, కళారంగాల వారు లౌక్యంతో వ్యవహరించి లాభాలు పొందుతారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు కలసి వస్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల సహాయం అందుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాలు ఒక గాటన పడతాయి. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. ఆరోగ్యం సంతృప్తికరం. పెట్టుబడులు స్వల్పంగా లాభదాయకం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)
పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మెరుగవుతాయి. కుటుంబానికి కొంత సమయం కేటాయించవలసి వస్తుంది. ఉద్యోగులకు మంచి తరుణం. అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ ఆదాయానికి ఢోకా ఉండదు. విద్యార్థులు మంచి ర్యాంకులతో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు అనుకూలిస్తాయి. జీవన సౌఖ్యం. ఆశించిన విజయాలతో ఇంటిలో సంతోష వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు అనుకూలిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆత్మస్థైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ఇంటి, వాహన, ఆభరణాల మార్పు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన పరిచయ లాభాలు. రావలసిన బకాయిలు వసూలవుతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సంతాన భాగ్యం. సమస్యలున్నప్పటికీ పరిష్కార మార్గాలు దొరుకుతాయి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
సంఘంలో గౌరవ మర్యాదలు మెరుగవుతాయి. బంధుమిత్రులతో యాత్రలు, ప్రయాణాలు అర్థవంతంగా మారుతాయి. వాహన సౌఖ్యం. చాకచక్యంతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తారు. బంధుమిత్రులు మీ సాయాన్ని కోరుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆదాయ వ్యయాలు ఫరవాలేదనిపిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు. వ్యాపారస్థులు వ్యాపార విస్తరణకు బ్యాంకులను ఆశ్రయించాల్సి రావచ్చు. మీ మాటకు తిరుగుండదు. శుభకార్యాలు కలసి వస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రయత్నాలు అన్నింటా అనుకూలిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. స్ర్తిలకు గౌరవం పెరుగుతుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. వస్తు, ధన, సంతాన ప్రాప్తి. అన్నింటా మీదే పైచేయి. మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బంది లేకుండా చూసుకోండి. శుభకార్యాలు కలసి వస్తాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855