ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (జూన్ 18 నుండి 24 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక స్థితిగతులు అనుకూలిస్తాయి. ఇష్టకార్య సిద్ధి. సాంకేతికంగా వృద్ధి వెంటే అవకాశం. హితుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తులు ప్రవృత్తులకు దగ్గరగా ఉంటాయి. వ్యాపారాదులందు పోటీ ఉంటుంది. విస్తరణకు అవకాశాలు. ఉద్యోగుల శక్తికి మించి పనులు చేయాల్సి వస్తుంది. స్పెక్యులేషన్‌లో స్వల్ప లాభాలు. అనుకూల వాతావరణంలో ప్రగతి. శుభకార్య ప్రణాళికలు ఫలప్రదమవుతాయి. తొందరపడకండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఆర్థిక కార్యక్రమాలు కలసి వస్తాయి. అనుకున్న పనులు అనుకోని విధంగా పూర్తి చేయవలసి వస్తుంది. ఇంటి సభ్యుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండనుంది. ధనాదాయం స్వల్పంగా అందుతుంది. చేస్తున్న వ్యాపారాలు, వృత్తులు, వ్యవహారాలు ఇతరులను ఆనందపరుస్తాయి. స్ర్తిల సలహాలు మీ ఆలోచనలకు సహకరిస్తాయి. స్పెక్యులేషన్ ఫలవంతం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రయాణాలు ప్రయోజనకరం. ఉద్యోగాలు సంతోషకరంగా ఉంటాయి. శ్రమానుకూల వాతావరణం. స్పెక్యులేషన్ మిశ్రమం.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక ఉన్నతి. మీ హితుల సాయం తప్పకుండా అందుతుంది. ప్రయాణాలు అనవసరంగా చేయకండి. విలువైన వాటితో ప్రయాణాలు ఆలోచించండి. జాగ్రత్త మేలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు చక్కని ప్రయోజనాలను అందిస్తాయి. స్పెక్యులేషన్ దీర్ఘకాలికం. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేసేందుకు మంచి సమయం. వదంతులు నమ్మకండి. నిర్ణయాత్మక పనులు మీకు గుర్తింపును తెస్తాయి. శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆర్థిక వృద్ధి. ముఖ్య కార్యసిద్ధి. పెద్దల ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. వీసా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక ఉన్నతి. విద్య, వ్యవహారాదులు ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది. విరుద్ధ భావాలు వద్దు. నిరుద్యోగులకు, చిరుద్యోగులకు ఆర్థిక లాభాలు. స్పెక్యులేషన్ స్వల్ప లాభం. ప్రయాణాలు ప్రయోజనదాయకంగా ఉంటాయి. ఆలోచనతో వ్యవహరించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

హితులు సాయం అందుకుంటారు. సమస్యలు ఎదుర్కొంటారు. ఆటంకాలు దాటి అన్నింటా లౌక్యంతో ముందుకు వెళతారు. వాహన ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త పడండి. వాహన మార్పులుంటాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు తృప్తినిస్తాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సందేహంతో నిర్ణయాలు తీసుకోకండి. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. స్ర్తిలకు ఉద్యోగావకాశాలు మెండు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఆదాయ వ్యయాలు మెరుగున పడతాయి. ఏ కార్యం చేసినా సంయమనంతో చేయండి. లేకుంటే వ్యతిరేకతలు చోటు చేసుకోనున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. అనుకున్న పనులు వనరులకు మించి చేయకండి. పైకం ఒకదానికి అనుకున్నది మరొక దానికి సర్దుబాటు చేయాల్సి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి. అస్థిరత్వం, అలసత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పరిశీలనాత్మకంగా ముందంజ వేస్తారు. ఒకసారి చేసిన పనిని మరోసారి సమీక్షించుకొని చేయాల్సి వస్తుంది. ఆర్థిక ప్రగతి. ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. చేపట్టే వృత్తి, వ్యాపార, రియల్ ఎస్టేట్, వ్యవహారాలు తృప్తినిస్తాయి. విదేశీ యత్నాలు, విద్యా రంగం వారికి, పోటీ పరీక్షార్థులకు అనుకూలం. స్పెక్యులేషన్ అంచనాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. అనారోగ్యానికి దరికి రానీయకండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఐచ్ఛికంగా కొన్ని పనులు వాటంతట అవే పూర్తవుతాయి. లోగడ మీరు చేసిన పనులలో, వృత్తి, వ్యాపార, రాబడుల రంగాలలో వృద్ధిని చూస్తారు. కుటుంబంలో ముఖ్యమైన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అధికారులతో సంయమనం పాటించాలి. మనసెరిగి ప్రవర్తించండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇతరుల చేతలు, మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మెళకువ పాటించాలి. బహుమతులు అందుకుంటారు. అనుకోని ఘటనలలో పాల్గొనవలసి వస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆదాయం అనుకూలిస్తుంది. వ్యయ నియంత్రణ మేలు. అనుకోకుండా గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యక్తులతో స్నేహ లాభాలు. శుభ కార్య యత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన వృత్తి, వ్యాపార, వ్యవహారాదులు తృప్తినిస్తాయి. ఉద్యోగులు శుభాలను, అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. ఉత్సాహం మీకు కలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలున్నా చేయవలసిన పనులు హితుల సాయంతో పూర్తవుతాయి. స్పెక్యులేషన్ మిశ్రమం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

ఆదాయ వృద్ధి. ఖర్చులను నియంత్రించుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో వృద్ధి కానవస్తుంది. నిరాశా నిస్పృహలను దరికి రానీయకండి. విలువైనవి ఖరీదు చేస్తారు. మిత్రులు, సన్నిహితుల సమస్యలను పరిష్కరిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం కూడదు. ప్రతి విషయంలోనూ ఆందోళన పడకండి. ధన నష్టం. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక లావాదేవీలు ఈ వారం అవసరానికి నియంత్రించుకోవాల్సి ఉంటుంది. భేదాభిప్రాయాలు రాకుండా కుటుంబ సభ్యులతో మెలగాలి. వృత్తి, వ్యాపార, వ్యవహార రంగాలు మార్పును కోరుతాయి. ఉద్యోగ రంగంలో సమిష్టిగా ఉండి సత్ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన కల్పించేందుకు కృషి చేయండి. సంతోషకరమైన వార్తలు వింటారు. కార్యక్రమాలలో పాల్గొంటారు. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థికంగా బలపడతారు. మిత్రులు సంఖ్య పెరుగుతుంది. గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి గోచరిస్తుంది. బృంద కార్యాలు, సంఘ కార్యక్రమాలందు మీ ప్రమేయంతో ముందుకు వెళతాయి. వృత్తి, వ్యాపార, వ్యవహార, ఉద్యోగ, సాంకేతిక రంగాలు గతం కంటె మేలుగా ఉంటాయి.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855