ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( జూలై 17 నుండి 23 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆటంకాలు లేకుండా పనులను పూర్తి చేసుకుంటారు. ఆదాయ వ్యయ ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, కళ, సాంకేతిక, వైద్య, విద్య రంగాలందు అనుకూలతలుంటాయి. కుటుంబంలో చికాకులు పెరిగే సూచనలున్నాయి. వాహన, విలువైన వస్తువుల వినియోగమందు అప్రమత్తత అవసరం. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ఇతరులతో వ్యవహారాలందు నేర్పు అవసరం. పెద్దల ఆశీస్సులు, సహకారాలందుకుంటారు. స్ర్తిలకు అనుకూలం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అన్నింటా ఆలోచనతో వ్యవహరించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
పనులు పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధమైన కార్యాలు అనుకూలిస్తాయి. వాహన ప్రయాణాలందు నియంత్రణ అవసరం. సంతాన సౌఖ్యం. తీర్థయాత్రా ఫలప్రాప్తి. తృప్తి అన్నింటా కలిగి ఉంటుంది. వృత్తి, వైద్య, విద్య, ఉద్యోగ రంగాల వారు మెరుగైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ వ్యక్తుల సహకారాలు ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికారులతో సానుకూలంగా మెలగి పనులను బకాయి పడకుండా చూసుకుంటారు. విద్య విషయాలందు శుభం. గతంలో స్తంభించిన శుభ కార్య యత్నాలు తెరపైకి వస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలందు తృప్తి. ధైర్యంతో ముందడుగు వేస్తారు. వాహన సౌఖ్యం. కానీ అప్రమత్తత అవసరం. శత్రుజయం. స్ర్తి మూలక సాయం లభిస్తుంది. తొందరతో కూడిన వాగ్దానాలు చేయవద్దు. మానసికంగా కృంగవద్దు. సంతాన విషయాలు ఆలోచింపజేస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వ్యాపారాలందు అనుకున్న చెల్లింపులు పూర్తి చేసుకో గలుగుతారు. వ్యాపార, విద్య, వైద్య, ప్రయాణ, వినోద, సినిమా రంగాల వారు మెరుగుపడతారు. పరుగుతో పనులు చేపట్టకండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
తొందరతో పనులు చేపట్టకండి. ఆరోగ్యం తృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దంపతులు సంయమనం పాటించాలి. భూ సంబంధ వ్యవహారాలందు అప్రమత్తత ఉండాలి. స్పెక్యులేషన్ వాయిదా వేసుకోండి. విద్య, వైద్య, వృత్తి, వ్యాపారాలు విస్తరణకు అవకాశాలున్నా వాయిదా వేసుకోవటం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకోండి. ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. స్వీయ నిర్ణయాలు అమలు చేయండి. వాదులాట వద్దు. స్పెక్యులేషన్ స్వల్పంగా అనుకూలిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
ఇతరుల పనులను శక్తికి మించి చేయవద్దు. మాటలు పడవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయంకన్నా ఖర్చులు అధికమవుతూండటం వల్ల ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్న ప్రయోజనాలు వెంటనే రాకపోవచ్చు. ఆస్తి వ్యవహారాలలో ఊహించని మార్పులున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, చేతివృత్తుల వారు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు బదిలీలు, స్థల మార్పులుంటాయి. పెట్టుబడులందు జాగ్రత్త అవసరం. దంపతులు సమిష్టి నిర్ణయాలు ఉపకరిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
సన్నిహితుల సాయంతో తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వపరంగా లాభం పొందుతారు. కుటుంబం కోసం విరివిగా ఖర్చు చేయవలసి వస్తుంది. విద్యా విషయాలందు నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. రావలసిన పైకం ఆలస్యంగానైనా అందుతుంది. దంపతులు పలు రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, సాంకేతిక, వ్యాపార, చేతివృత్తుల వారు మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై ఆధిక్యత.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగున్నా ఖర్చులు ఆలోచింపజేస్తాయి. సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వాహన సౌఖ్యం. దంపతులు ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు, ప్రయాణాలున్నాయి. శత్రువులు మిత్రులవుతారు. కుటుంబంలో చర్చలు. పొరపొచ్చాలు లేకుండా వ్యవహరించండి. వృత్తి, వ్యాపార, విద్య, సాహితీ, రాజకీయ రంగాల వారు మెరుగైన కృషితో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
ఆచితూచి వ్యవహరించండి. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడనున్నాయి. గతంలో నిల్వ చేసిన పైకం ఖర్చు పెట్టవలసి వస్తుంది. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాలందు రాణింపు ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన సౌఖ్యం. బకాయి పనులు కొన్ని పూర్తి చేస్తారు. ఆత్మీయతతో స్ర్తి పురుషులు ప్రేమను పొందుతారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల వద్దకు పరామర్శకై వెళ్లవలసి వస్తుంది. డాంబికాలకు పోవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. చేయవలసిన పనులు వాయిదా పడే అవకాశముంది. ఎదుగుదలకు, ఒదుగుదలకు మంచి సమయం. మీ మాటల నేర్పుతో మీ తోటివారిలో ఆధిక్యత పెంచుకుంటారు. ఆదాయ లావాదేవీలు సరిసమానంగా ఉంటాయి. శారీరక శ్రమ, అలసట అధికంగా రానీయకండి. స్పెక్యులేషన్ వాయిదా వేయడం మంచిది. చికాకులవల్ల పనులు వాయిదా పడతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు రానీయకండి. ఆధ్యాత్మిక యాత్రలందు బంధుమిత్రులతో కలిసి ప్రయాణిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఇతరులచే ప్రశంసలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాలందు జయం. ఉత్సాహంగా వ్యవహరిస్తారు. గత సమస్యలు సవరించుకుంటారు. ఇష్ట కార్యసిద్ధి. వివాహ, ఉద్యోగ విషయాలందు శుభాలుంటాయి. భాగస్వామి తృప్తితో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు శుభ పరిణామాలు. ఆర్థికంగా ఫర్వాలేదు. ఖర్చులు యోగపడతాయి. బంధుమిత్రులను పరామర్శ చేయవలసి వస్తుంది. మీ మార్గ దర్శకత్వంలో ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంయమనం పాటించండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
టెన్షన్లతో పనులు చేయకండి. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్థిరాస్తులకు రిపేర్లు చేయించవలసి వస్తుంది. అనుకున్న ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందుతారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చేయవలసిన పనులను ధైర్యంగా పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం. పుకార్లను నమ్మకండి. సంతాన సౌఖ్యం. ప్రయాణాలు, నూతన రంగాల అభివృద్ధికి కృషి చేస్తారు. అన్ని రంగాల వారు సంతృప్తిని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆలోచన అన్నింటా అవసరం.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
పట్టుదలతో కార్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, విద్య, న్యాయ, సాంకేతిక రంగాలందు ఉన్నతిని పొందుతారు. ఆర్థికంగా ఫరవాలేదు. నూతన పనులకు పైకం ఖర్చు పెట్టవలసి వస్తుంది. వృత్తి, విద్య, వ్యాపార రంగాల వారు సమస్యలున్నప్పటికీ పరిష్కార మార్గాలను అనే్వషిస్తారు. కుటుంబంలో మీ మాటే నెగ్గుతుంది. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. దంపతులు వేరువేరుగా ప్రయాణించవలసి వస్తుంది. స్పెక్యులేషన్ స్వల్పంగా అనుకూలం.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855