ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? (జూన్ 12 నుండి 18 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కార్యాల పట్ల సానుకూలత. ఆర్థిక లావాదేవీల పట్ల నియంత్రణ అవసరం. ఆరోగ్య విషయంలో ఔషధ సేవనంతో ఉపశమనం కలుగుతుంది. కృషికి తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. వాహన సౌఖ్యం. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం చోటు చేసుకుంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

కార్యక్రమాలలో విజయం. మీ తెలివితేటలు మిత్రులకు, శ్రేయోభిలాషులకు యోగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. స్పెక్యులేషన్ రాణిస్తుంది. ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. సంగీత, సాహిత్య రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అన్యమనస్కంగా పనులను నిర్వహించకండి. వృత్తి, వ్యాపార సాంకేతిక రంగాల వారికి ధనలాభం. బదిలీలకు అవకాశమున్నది.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)

కార్యసిద్ధి. ఆదాయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ తెలివితేటలతో పనులను చాకచక్యంగా నిర్వహిస్తారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది. బంధువర్గంలో ప్రాముఖ్యత, సఖ్యత మెరుగవుతాయి. భయాందోళనలు చెందకుండా కార్యరంగంలోకి దూకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని వార్తలు సంతోషాన్నీ, కొన్ని వార్తలు ఆందోళనను కలిగిస్తాయి. సంయమనం పాటించండి. వృత్తి, వ్యాపార, కళారంగాల వారికి కొద్దిగా అనుకూల వాతావరణం.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఉద్యోగులకు మంచి తరుణం. అభివృద్ధి దిశగా పయనిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, బదిలీలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణ యత్నాలు మెరుగవుతాయి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొని గౌరవ మన్ననలను పొందుతారు. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఊహించని సమస్యలున్నప్పటికీ వాటికి పరిష్కారం దొరుకుతుంది. స్పెక్యులేషన్ అననుకూలం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

కార్యాలు పూర్తి చేస్తారు. ఎవరో వస్తారని ఎదురుచూడకుండా కార్యరంగంలోకి దూకడం ఉత్తమం. పదుగురి దృష్టి మీ కదలికలపై ఉంటుంది. అలసత్వంతో పనులను ఆరంభించకండి. నూతన వస్త్ర, వస్తుప్రాప్తి. మీ మాటకు విలువ పెరుగుతుంది. తలవని తలంపుగా బంధుమిత్రులకు సహాయాన్ని అందించాల్సి రావచ్చు. అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండండి. దంపతుల మధ్య సామరస్యం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఊపందుకుంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరవుతారు. విషయ వ్యవహారాల్లో శ్రద్ధ చూపాలి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

వాయిదా పడిన పనులు కొన్ని పూర్తవుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం. విందు వినోదాలలో పాల్గొంటారు. శారీరక, మానసిక బాధలున్నప్పటికీ ఆందోళన వద్దు. ఆలోచనతో మార్గాలు సుగమమవుతాయి. ప్రైవేటు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజానుకూల కార్యాలు నిర్వహించవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎన్నదగిన సమయం. సంయమనం అవసరం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. మనోవాంఛలు నెరవేరుతాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలందు సానుకూల ఘటనలు ఎదురవుతాయి. పనులను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయేమో గమనించండి. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం. నూతన వస్త్ర, వస్తు ప్రాప్తి. విలువైన వస్తువుల ఖరీదు నందు మెళకువ అవసరం. ఇతరులకు హామీలుండకండి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

అందివచ్చిన అవకాశాలతో పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మాటకు విలువ మెరుగవుతుంది. ఉద్యోగులు అప్రమత్తతతో ఉండాలి. ఆదాయ వ్యయాలందు నియంత్రణ అవసరం. కోర్టు బయట సమస్యలను పరిష్కరించుకోవటం మంచిది. పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపార, రియల్ ఎస్టేట్, రాజకీయ, పాత్రికేయ రంగాల వారు సత్ఫలితాలను పొందుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)

పరిశీలనాత్మక ధోరణితో పనులు పూర్తి చేస్తారు. ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. అన్నింటా పెద్దలు, అధికారులు, అనుకోని అతిథులు సహకరిస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో కంటె స్వవిషయంలో శ్రద్ధ చూపండి. ఆలోచించి ముందడుగు వేయండి. సమస్యలున్నా పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. ఉద్యోగులకు పదోన్నతలు, బదిలీలుంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రయాణాలపుడు అప్రమత్తత అవసరం. విందు వినోదాలలో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
నిదానమే ప్రధానమని గమనిస్తూ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలలో మెళకువ అవసరం. స్థల మార్పులకు, బదిలీలకు అవకాశముంది. ఉద్యోగులకు, వ్యాపారస్థులకు నూతన శాఖ ప్రారంభానికి అనుకూలం. బంధుమిత్రులతో సఖ్యత, సభ్యత పాటించండి. మీ మాట అన్నింటా పైచేయిగా ఉంటుంది. పర్మినెంట్ ఉద్యోగులకు అవకాశాలు మెరుగుపడతాయి. కార్యసిద్ధి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు, చిత్రాలు పొందుతారు.

కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

కుటుంబ సభ్యులచే శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు మెరుగైన కృషితో రాణిస్తారు. పెద్దల మన్ననలుంటాయి. ఆదాయ వ్యయాలు ఫరవాలేదనిపిస్తాయి. విద్యా రంగాల వారు తమ పనిపైనే ధ్యాస పెట్టాలి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. అధికారులతో పనులు పూర్తవుతాయి. దంపతులకు మేలైన అవగాహన ఉంటుంది. స్పెక్యులేషన్ బాగుంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

పనులు పూర్తి చేస్తారు. వ్యవహార లాభం. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. మనశ్శాంతి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు శ్రమపై అనుకున్నవి పొందుతారు. వాహన సౌఖ్యం. కుటుంబంలో సఖ్యత మెరుగుపడుతుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రత అవసరం. స్పెక్యులేషన్ ఫరవాలేదు.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855