ఎలావుందీ వారం?

ఎలావుందీ వారం? ( మే 15 నుండి 21 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులున్నప్పటికీ సమయానికి ధనం అందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆదాయం సమృద్ధిగా సమకూరుతుంది. మీ మాటలు ఇతరులకు సాంత్వన కలిగిస్తాయి. శక్తికి మించిన పనులు తలపెట్టకండి. వాహనం నడపడంలో మెళకువ అవసరం. దంపతులు సఖ్యతతో మెలగాలి. సంతానప్రాప్తి. ధైర్య సాహసాలే కొండంత అండ. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

అపార్థాలకు తావివ్వకండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి కార్యాలు తలపెట్టండి. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని ఇబ్బందికర సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కారమవుతాయి. శుభకార్యాలు తలపెడతారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు కలసి వస్తాయి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుండేట్టు చూసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా)

మనోబలంతో కార్యాలు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం తృప్తికరం. విమర్శించే వారిని దూరంగా ఉంచండి. ఎవరి మాటలూ పట్టించుకోవద్దు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల వారికి ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనప్పటికీ పరిష్కరించుకో గలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ర్తిలకు కలిసొచ్చే కాలం. శుభ కార్యాలు అనుకూలిస్తాయి. ఆభరణాలు ఖరీదు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. మాట పట్టింపులకు పోకండి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల వారికి కృషికి అనుకూలంగా ఫలితాలుంటాయి. శత్రువులు మిత్రులవుతారు. జాయింట్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు నెరవేరుతాయి. ప్రయాణాలందు డబ్బు, ఆభరణాలు జాగ్రత్త. అనుకోకుండా పైకం అందుతుంది. రావలసిన బకాయిలు కొన్ని అందుతాయి. నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాకర్షణ లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

మానసికోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని పనుల్లో జాప్యం కలిగినప్పటికీ పూర్తవుతాయి. బంధుమిత్రులతో గొడవలు రాకుండా చూసుకోండి. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులూ అధికంగా ఉంటాయి. ఆశించిన ప్రయోజనాలు పొందకపోవచ్చు. ఆరోగ్యం తృప్తికరం. వాహన సౌఖ్యం. భార్యాభర్తలు మాట పట్టింపులకు పోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, పోటీ పరీక్షలందు అనుకూల వాతావరణం వల్ల అనుకున్నది అనుకున్నట్లు అవుతుంది. ఆహార విహారాలందు మితాన్ని పాటించండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. విరోధులపై ఓ కనే్నసి ఉంచండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

ఏకాగ్రత వహిస్తేనేగానీ పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యుల సహకారం ఉండేట్లు చూసుకోండి. విశేష వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల వారు తగిన రాణింపుతో లాభాలను పొందుతారు. మిత్రుల సహాయం లభిస్తుంది. నూతన పనులు ప్రారంభిస్తారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బుద్ధి కుశలత ప్రదర్శించి అన్నింటా జయం పొందుతారు. ఆదాయ వ్యయాలు అనుకూలిస్తాయి. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
గతంలో పూర్తి చేయలేని పనులు ఈ వారంలో పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలు మెరుగవుతాయి. ఇతరులతో సంయమనంతో వ్యవహరించాలి. ఓర్పు నేర్పు తీర్పుల వల్ల మంచి మార్పులకు అవకాశం. దంపతుల మధ్య సఖ్యత చేకూరుతుంది. వృత్తి, వ్యవసాయ, వ్యాపార రంగాల వారు ఆశించిన ఫలితాలు ఆలస్యంగానైనా పొందుతారు. ఉద్యోగాల పర్మినెంట్‌కు అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కుటుంబ సౌఖ్యం. వాహన లాభం. బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు, శుభకార్యాలు కలిసి వస్తాయి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

మనోవాంఛ నెరవేరుతుంది. బాకీలు వసూలవుతాయి. ధనాదాయమున్నా సంతోషం ఉండకపోవచ్చు. గతంలో ఆగిన పనులు జయప్రదంగా పూర్తి చేస్తారు. భూ, గృహ పేచీలుంటే తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల వారు సంయమనం పాటించాలి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆవేశాలకు లోనవకండి. శుభకార్యాలకు హాజరవుతారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపా)

ధైర్య సాహసాలు పెరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్‌లో ముఖ్యమైన పదవి పొందుతారు. అన్నింటా ముందడుగు మంచిది కాదేమో ఆలోచించండి. సమస్యలను పరిష్కరించుకొంటారు. మిత్రుల, అధికారుల సాయంతో. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. అనుకోని ధనలాభం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీ ప్రయాణాలు అనుకూలం. ఒక పని పూర్తయ్యేంతవరకు వేరే పనుల మీద ధ్యాస పెట్టవద్దు. ఎదుటి వారితో జాగ్రత్త.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని సమస్యల నుంచి లౌక్యంగా బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. అందని అవకాశాలకు అర్రులు చాచకండి. ఆస్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం. ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలకై అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆశయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు మంచి తరుణం. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. అత్యాశలకు పోవద్దు. దంపతులు పట్టింపులకు పోవద్దు. సంతాన ప్రాప్తి. వస్త్ర, వస్తు లబ్ధి. మీ మాటకు తిరుగుండదు. వృత్తి వ్యాపారాలందు లక్ష్య సాధన లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పట్టుదలతోనే మెప్పుదల ఉంటుంది. సరైన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించటం మంచిది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యక్తిత్వ నిపుణులకు అనుకూల కాలం. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి. స్ర్తిలకు అనుకున్న కార్యాలు కలసి వస్తాయి. సంతాన ప్రాప్తి. నూతన పరిచయాలు లాభిస్తాయి. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది.

ఎ.సి.ఎం. వత్సల్ 93911 37855