S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/03/2016 - 07:54

మానస్, హాసికాదత్ జంటగా రైజింగ్ సన్ ఫిలింస్ పతాకంపై హాసికాదత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘బేబీ డాల్’. మున్నాకాశి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. గాయకుడు శ్రీరామచంద్ర ఆలపించిన పాటతో రికార్డింగ్ ప్రారంభించారు.

01/31/2016 - 22:42

సిద్దు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్, మంచు లక్ష్మి, మహేష్‌మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. రూపొందిస్తున్న చిత్రం ‘గుంటూరు టాకీస్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 3న ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు.

01/31/2016 - 22:40

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ దర్శకత్వంలో, పళ్లా రమణయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే..’ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

01/31/2016 - 22:29

శ్రీ కంచెమ్మతల్లి సినీప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం దర్శకత్వంలో దేవదాస్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘రెండక్షరాలు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

01/31/2016 - 22:27

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్టోరీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే పలు సంచలనాలు క్రియేట్ చేసిన ఈ భామ లేటెస్ట్‌గా ‘పరేడ్’ అనే సినిమాలో నటించింది. రాజస్థాన్‌లోని ఓ మారుమూల పల్లెటూరిలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఊరిలో తమ జీవితాలు కోల్పోయిన నలుగురు మహిళలు కొత్త జీవితాన్ని వెదుక్కునే దిశగా ఇది సాగుతుంది.

01/31/2016 - 22:26

‘నేను-శైలజ’ సినిమాతో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేయడంతోపాటు హిట్‌ని అందుకుంది అందాల భామ కీర్తి సురేష్. తొలి సినిమా హిట్ కొట్టగానే తన రెమ్యూనరేషన్ పెంచేసిందన్న టాక్ ఇప్పుడు విన్పిస్తోంది. మొదటి సినిమాకే ఇలాచేస్తే ఎలా అంటూ ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ భామ స్పందించింది. పారితోషికం పెంచినట్టుగా వస్తోన్న వార్తల్లో నిజంలేదని కీర్తిసురేష్ స్పష్టం చేసింది.

01/31/2016 - 22:26

ఇటీవలే అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అఖిల్’ చిత్రాన్ని రూపొందించిన వినాయక్‌కు ఆ సినిమా భారీగా నిరాశపరచడంతో ఇప్పుడు వినాయక్ తనను తానూ ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం వినాయక్ నెక్ట్స్ సినిమా నితిన్‌తో చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు చిరంజీవి 150వ సినిమాను పూర్తిచేసిన తరువాత, వినాయక్ ఈ సినిమా చేయనున్నాడని తెలిసింది. ఇటీవల వినాయక్‌ను నితిన్, అతని తండ్రి కలిశారు.

01/31/2016 - 22:25

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సొనారిక జంటగా తమిళ ‘సుందర పాండ్యన్’కు రీమేక్‌గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పీడున్నోడు’. భీమనేని సునీత నిర్మాత. ఇటీవల విడుదల చేసిన సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. నటుడు నాగార్జున, వెంకటేష్‌లు చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లు అందజేశారు.

01/31/2016 - 22:24

వైభవ్, రమ్యానంబిసన్ జంటగా బ్లాక్‌బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వై.శివప్రసాద్, శ్రీనివాస్ అనంత్‌నేని రూపొందించిన చిత్రం ధనాధన్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేశారు.

01/31/2016 - 22:23

‘కథానాయకుడు రాజ్‌తరుణ్‌పై నమ్మకంతో ఈ చిత్రం చేశా. ఓ రకంగా రాజ్‌తరుణ్‌ను దృష్టిలోపెట్టుకునే ఈ కథ రాసుకున్నా. ఓ అందమైన సింపుల్ కథను అందరికీ నచ్చే విధంగా రూపొందించా’ అని దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు.

Pages