S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2015 - 22:30

గ్రీన్‌సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ పతాకంపై గన్నవరపు చంద్రశేఖర్ రూపొందించిన చిత్రం ‘ఇక సెలవ్’. సాయిరవి, దీప్తి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు డుంగ్రోతు నాగరాజు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను, ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో సి.కళ్యాణ్, మారుతి విడుదల చేశారు.

11/29/2015 - 22:28

మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఉస్తాద్ హోటల్ చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి అనువదించారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో ‘జతగా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ..

11/29/2015 - 22:25

రవితేజ, తమన్నా, రాశిఖన్నా ప్రధాన తారాగణంగా రూపొందిన బెంగాల్ టైగర్ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమం రైళ్లను తాకింది. ఇటీవల దర్శక నిర్మాతలు ప్రకటించినట్లుగా రైలు కంపార్టుమెంట్లలో సినిమా పోస్టర్లను ప్రదర్శించి, వినూత్న ప్రచారాన్ని
మొదలుపెట్టారు.

11/29/2015 - 22:23

బిగ్ బి అమితాబ్ కొత్తరూపంలో దర్శనమిచ్చారు. రోజూ కన్పించే రూపానికి భిన్నంగా కొత్త ఆహార్యంతో అభిమానులను అలరించారు. రిభుదాస్ గుప్తా దర్శకత్వంలో సుజొయ్ ఘోష్ నిర్మిస్తున్న ‘ళ3శ’లో అమితాబ్, నవాజుద్దీన్ సిద్ధిఖి, బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభమైంది.

11/29/2015 - 22:17

మత అసహనంపై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చను ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు శేఖర్‌కపూర్ స్వాగతించారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భాగంగా ఈరోజు మీడియా సెంటర్‌లో శేఖర్‌కపూర్ విలేకరులతో మాట్లాడారు. అసహనంపై చర్చ మంచిదే అయినా ఈ విషయంలో మేధావులు ప్రదర్శించే దూకుడు సమాజానికి భారంగా మారకూడదని పేర్కొన్నారు.

11/29/2015 - 22:14

నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అఆ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. సమంతా, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా తరువాత మరో సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు నితిన్. నూతన దర్శకుడు వేణు మల్లిడి దర్శకత్వం వహించే ఈ సినిమా వచ్చేనెలలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట!

11/29/2015 - 22:06

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించే నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలవుతున్నాయి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘తానిఒరువన్’ సినిమా రీమేక్‌లో చరణ్ నటిస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఇప్పటికే తమిళంలో ఈ పాత్రలో అరవింద్‌స్వామి నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

11/29/2015 - 22:05

తెలుగు సినిమా విప్లవ చిత్రాల కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

11/29/2015 - 22:02

అర్పిత క్రియేషన్స్ పతాకంపై అశోక్‌కుమార్, కిరణ్, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా మనోన్ ఎం. దర్శకత్వంలో పత్తికొండ కిరణ్ రూపొందించిన చిత్రం ‘కాకి’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కాకి చిత్రంలో కథ డిఫరెంట్‌గా ఉంటుందని, అందుకు తగిన విధంగానే ఆ పేరును నిర్ణయించామని తెలిపారు.

11/29/2015 - 21:59

అప్పటికప్పుడు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో సెన్సార్ విధానం అసంబద్ధమైనదని, కాలం చెల్లిన సెన్సార్‌బోర్డును రద్దు చేయాలని ప్రఖ్యాత దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. జేమ్స్‌బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దు సన్నివేశం నిడివిని కుదించాలన్న సెన్సార్‌బోర్డు అధ్యక్షుడు పహలాజ్ నిహలానీ నిర్ణయంపై దేశంలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నవేళ వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Pages