S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/14/2016 - 00:34

తెలుగు, తమిళ, హిందీ భాషలలో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం అభినేత్రి. తమిళ, హిందీ భాషల్లో ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై ప్రభుదేవా అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు.

09/11/2016 - 21:20

రామ్, రాశిఖన్నా జంటగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ హైపర్ (ప్రతీ ఇంట్లో ఒకడుంటాడు).

09/11/2016 - 21:18

ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన జనతాగ్యారేజ్ చిత్రం మంచిటాక్‌తో నడుస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవ సభను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, సమంత, కొరటాల శివ, దిల్‌రాజులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ‘కొన్ని సందర్భాల్లో ఏమీ మాట్లాడలేం. కన్నీళ్లు మాత్రమే వస్తాయి.

09/11/2016 - 21:16

బాలకృష్ణ కథానాయకుడుగా రూపొందిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో కథానాయికగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆమె జన్మదినం సందర్భంగా చిత్రంలో ఆమె నటిస్తున్న ‘వశిష్ఠాదేవి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.

09/11/2016 - 21:14

మంచు విష్ణు, హన్సిక జంటగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న లక్కున్నోడు చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు మోహన్‌బాబు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ,‘లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సినిమా ఇది.

09/11/2016 - 21:12

సాగర్ కథానాయకుడుగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ రూపొందించిన ‘సిద్ధార్థ’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సెన్సార్ బోర్డు ఎ-సర్ట్ఫికెట్ ఇచ్చిందన్నారు.

09/11/2016 - 21:10

సంచలనాలు రేపడంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని, ఇప్పటికే ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన ఆయన తాజాగా మరో సంచలనానికి తెరలేపాడు. ‘పవన్ కంటే నేనే బెస్ట్ సింగర్‌ని’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పవన్‌కళ్యాణ్ రెండురోజుల క్రితం కాకినాడ బహిరంగ సభలో ఓ జానపద గేయం పాడారు.

09/11/2016 - 21:08

అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ అందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దయ్యం.. నాకేం భయం’. దీనికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రెండు పాటలు పూర్తిచేయాల్సి ఉందని, ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోందని అన్నారు.

09/11/2016 - 21:07

దిపక్ సరోజ్, మాళవికా మీనన్ జంటగా కోటపాటి శ్రీను దర్శకత్వంలో సి.కళ్యాణ్ సమర్పణలో కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కందిమళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ కే రన్’. ఆడియో విడుదల చేశాక ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి.కళ్యాణ్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ‘కొత్త కథాకథనాలతో తెరకెక్కించిన లవ్ ఎంటర్‌టైనర్ ఇది.

09/11/2016 - 21:05

ఎ.ఆర్.మురుగదాస్ సోదరుడు దిలీపన్, అంజలి జంటగా తమిళంలో రూపొందించిన ‘వత్తికుచ్చి’ని తెలుగులో గోలీసోడాగా అనువదిస్తున్నారు. శ్రీ జె.వి.ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్‌రావు మార్టోరి అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెలలోనే విడుదల చేయడానికి సిద్ధం చేశారు.

Pages