S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/11/2016 - 21:02

ప్రతీక్, శ్రావ్య, శ్రీసయ్యని ప్రధాన తారాగణంగా రాహుల్ ఫ్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న ‘వానవిల్లు’కు సంబంధించి కేరళ షెడ్యూల్ పూర్తిచేశారు.

08/11/2016 - 21:01

హాస్యనటుడు అలీ కథానాయకుడిగా నాగూ గవర (వీకెండ్ లవ్ ఫేం) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘సంజయ్ రామస్వామి’ అనే పేరును ఖరారు చేశారు. సూర్య నటించిన ‘గజని’ చిత్రంలో కథానాయకుడి పేరు సంజయ్ రామస్వామి. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్‌గా ‘గజని’ పేరును నిర్ణయించడం సరికొత్త ఉంటుందని దర్శకుడు తెలిపారు.

08/11/2016 - 20:59

ఉదయ్, స్వప్న జంటగా రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’. హారిక కల్లూరి రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ కల్లూరి మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాము మూడేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపామని, దీన్ని కెనడాలో చిత్రీకరించడంతో లుక్ సరికొత్తగా వుంటుందని తెలిపారు.

08/11/2016 - 20:57

పూజిత, ధీరేంద్ర జంటగా షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘డర్టీగేమ్’. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సస్పెన్స్, రొమాన్స్ గేమ్‌గా ఇది రూపొందుతోందని, ఈ ఆట ఎవరు ఆడారు? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు?

08/11/2016 - 20:57

ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దీనికి యు/ఎ సెన్సార్ సర్ట్ఫికెట్ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 19న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

08/11/2016 - 20:56

బాలీవుడ్‌లో మెప్పించి హాలీవుడ్‌లో ప్రవేశించి అక్కడి వారందరినీ తన చుట్టూతా తిప్పుకుంటున్న భామామణి ప్రియాంక చోప్రా. కళ్ళు జిగేల్‌మనిపించే అందంతో, అద్భుతమైన నటనతో హాలీవుడ్‌నే ఏలుతున్న నటి ఆమె. క్వాంటికో సిరీస్‌తో హాలీవుడ్‌లోప్రవేశించి ‘బేవాచ్’తో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకుంది. ప్రస్తుతం బేవాచ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా వుంది.

08/10/2016 - 22:34

టైటిల్ చూసి నాగచైతన్య సమంతను కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నారా? కాదు.. చైతు-సమంతలమధ్య ప్రేమాయణం ఓ వైపు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి చైతు నెక్స్ట్ సినిమా అదే ‘సోగ్గాడే చిన్నినాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందే ‘కళ్యాణం’ సినిమాలో ముందు సమంతనే హీరోయిన్ అనుకున్నారు. కానీ సమంత డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు తమన్నా వచ్చి చేరింది.

08/10/2016 - 22:32

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ రెజీనాకు ఈమధ్య కాస్త బ్రేక్ పడింది. వరుస పరాజయాలతో కెరీర్ వెనకపడింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గిపోవడంతో ఇప్పుడు తమిళంలో గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్న ఈ భామకు ఓ మంచి ఛాన్స్ దక్కింది. అయితే తమిళంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది కమెడియన్ సరసన కావడం విశేషం.

08/10/2016 - 22:31

సుమన్‌శెట్టి, రూపశ్రీ ప్రధాన తారాగణంగా దేవికృష్ణ సినిమా పతాకంపై వి.ఎ.కె.్భస్కర్ దర్శకత్వంలో శాబోలి రమాగౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘నువ్వు ఎవరో నేను ఎవరో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు పంపనున్నారు.

08/10/2016 - 22:29

రేష్మిగౌతమ్ కథానాయికగా నటించిన గుంటూరు టాకీస్ చిత్రం గతంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఆర్.కె. పతాకంపై రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

Pages