S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2018 - 01:40

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముజఫర్ పూర్ ఆశ్రమంలో బాలికలపై అత్యాచారాల ఘటనలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయరని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని జేడీఎయూ పార్టీ స్పష్టం చేసింది. జేడీయూ నేత కేసీ త్యాగి ఇక్కడ మాట్లాడుతూ ఈ ఘటనను ప్రయోజనాలకు రాజకీయ పార్టీలు వాడుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు.

08/06/2018 - 01:39

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆధార్ విషయంలో చెలరేగుతున్న వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదని భారత ఆధార్ అథారిటీ ఆదివారం నాడిక్కడ స్పష్టం చేసింది. గూగుల్ పొరపాటు చర్యల కారణంగా తలెత్తిన పరిస్థితిని కొన్ని సంకుచిత శక్తులు దుర్వినియోగం చేస్తూ ఆధార్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఈ అథారిటీ స్పష్టం చేసింది.

08/06/2018 - 01:38

న్యూఢిల్లీ, ఆగస్టు 5: చంద్రునిపై భారత్ నిర్వహిస్తున్న రెండో ప్రయోగం మరింత ఆలస్యం కానుంది. దీనిని జనవరిలో నిర్వహించవచ్చునని ఒక ఉన్నతాధికారి తెలిపారు. చంద్రునిపైకి మానవరహిత ప్రయోగాలు నిర్వహించాలనుకున్న ఇస్రోకు ఈ ఏడాది రెండుసార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. తొలుత ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించాలనుకున్నారు. ఈ ఏడాది తొలు త జిశాట్-6ఏ పేరుతో మిలటరీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించింది.

08/06/2018 - 01:36

న్యూఢిల్లీ, ఆగస్టు 5: అసోం రాష్ట్రంలో ప్రజలు పౌరసత్వ నిర్ధారణకు చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి దానిని నిలిపివేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, ఇది ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆరోపించింది.

08/06/2018 - 01:36

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పోలింగ్ బూత్‌లో ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఏ పార్టీకి ఓటు వేశారో వారికి తప్ప మరెవరికీ తెలియదని, పేపర్ ట్రయల్ మెషీన్ ఓటర్ల ఫొటోలు తీస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి అనుసంధానంగా ఏర్పాటు చేసే వోటర్ వెరిఫైబుల్ వోటర్ ఆడిట్ ట్రయల్ ఓటు వేసినట్లు ఒక రుజువు మాత్రమేనన్నారు.

08/06/2018 - 01:35

శ్రీనగర్, న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన పేరుమోసిన జైషి-ఇ-మహమ్మద్ (జెఇఎం) ఉగ్రవాది ముఫ్తీ వాకస్‌కు సంబంధించిన వివరాలను వెంటనే పంపాలని పాక్ దేశాన్ని భారత్ కోరనుంది. కాశ్మీర్‌లోని సుంజవాన్ ఆర్మీ శిబిరంపై మార్చిలో పేరుమోసిన టెర్రరిస్టు ముఫ్తీ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు సైనికులు, ఒక పౌరుడు, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.

08/06/2018 - 01:33

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆర్థిక నేరాలకు పాల్పడి, ఆతర్వాత కేసును తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయే వారి ఆటలకు తెరపడనుంది. ఈ ఏడాది ప్రవేశపెట్టినపలాయనం చిత్తగించే ఆర్థిక నేరగాళ్ల నిరోధక చట్టం బిల్లుకు రాష్టప్రతి ఆమోద ముద్ర లభించింది. కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వంద కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను ఎగ్గొట్టిన ఆర్థిక నేరస్థులు ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తారు.

08/06/2018 - 01:25

లక్నో, ఆగస్టు 5: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి భారతదేశ గొప్ప నాయకుల్లో ఒకరని, దేశ వికాసానికి నిరంతరం శ్రమించిన యోధుడని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికాస్ కీ గంగా స్కీంను తొలుత ప్రారంభించి లక్నో పరిసరాల అభివృద్ధికి పాటుపడిన నేత వాజపేయి అని ఆయన ప్రశంసించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు.

08/06/2018 - 01:22

చైన్నై, ఆగస్టు 5: రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం చెన్నై చేరుకుని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆస్పత్రిలో కరుణానిధి తనయుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో రాష్టప్రతి కొంతసేపు ముచ్చటించారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న రాష్టప్రతి విమానాశ్రయం నుంచి నేరుగా కావేరీ ఆస్పత్రికి వచ్చారు.

08/06/2018 - 02:05

న్యూఢిల్లీ: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి గద్దె దింపడానికి కొత్త రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం బీజేపీయేతర పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత హెచ్.డి.దేవగౌడ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pages