S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2018 - 17:51

న్యూఢిల్లీ: ఈ నెల 9న రాజ్యసభ ఉప సభాపతి ఎన్నికను నిర్వహించనున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్ వేసేందుకు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఖాళీ అయిన డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో 122 మంది సభ్యుల మద్దతు ఉంటేనే డిప్యూటీ చైర్మన్ పదవి వరిస్తుంది.

08/06/2018 - 13:29

పాట్నా: ముజప్ఫర్‌నగర్ అత్యాచారం కేసులో 14 మంది ప్రభుత్వ అధికారులపై బీహార్ రాష్ట్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించింది. ముజప్ఫర్‌నగర్ బాలికల సదనంలో బాలికలపై అత్యాచారం కేసులో సకాలంలో చర్య తీసుకోనందుకు ప్రభుత్వం అధికారులపై వేటు వేసింది. ఈ కేసులో ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏడుగురు ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను సర్కారు సస్పెండ్ చేసింది.

08/06/2018 - 13:12

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో 16 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/06/2018 - 13:00

అమరావతి: మానస సరోవర్ యాత్ర ముగించుకుని వస్తున్న తెలుగు యాత్రికులు సిమికోట్‌లో చిక్కుకుపోయారు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో యాత్రికులను తీసుకువచ్చే పరిస్థితులు లేకపోవటంతో హెలికాఫ్టర్‌లను నిలిపివేశారు. గత ఆరు రోజుల నుంచి ఎలాంటి ఆహారం, మందులు లేక యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 90 మంది యాత్రికులు ఉన్నట్లు, వీరిలో ఏలూరు మేయర్ భర్తతో పాటు, వారి బంధువులు కూడా ఉన్నట్లు తెలిసింది.

08/06/2018 - 20:50

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వెళ్లే బస్సును పోలీసులు తనిఖీలు చేయగా ఓ కాశ్మీర్ యువకుడి వద్ద ఎనిమిది గ్రనేడ్‌లు, రూ.60,580ల నగదును స్వాధీనం చేసుకున్నారు. త్వరలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీకి వచ్చే రాకపోకలపై నిఘా పెంచారు.

08/06/2018 - 04:35

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసం చేసి పరారైన మెహుల్ చోక్సీని అప్పగించాలని కోరుతూ భారత్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ఆంటిగ్వా ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మెహుల్ చోక్సీ కరేబియన్ దేశంలో పౌరసత్వం తీసుకుని స్థిరపడ్డాడు. కేంద్రప్రభుత్వ అధికారులు ఆంటిగ్వాకువెళ్లి ఆ దేశ ప్రభుత్వానికి మెహుల్ చోక్సీని అప్పగించాలని కోరుతూ డాక్యుమెంట్లను సమర్పించారు.

08/06/2018 - 01:48

చందౌలి (యూపీ), ఆగస్టు 5: రాజ్యసభలో ఓబీసీ కమిషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని, నిజంగా ఓబీసీలంటే కాంగ్రెస్‌కు ప్రేమ ఉందా అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, వెనకబడిన వర్గాల సముద్ధరణకు బీజేపీ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాలని ఆయన కవురారు.

08/06/2018 - 01:45

ముజాఫర్‌పూర్ అనాథ శరణాలయంలో అత్యాచార సంఘటనను నిరసిస్తూ,
ఆదివారం పాట్నా నగరంలో ప్రదర్శన నిర్వహిస్తున్న వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు.

08/06/2018 - 01:43

రాయిపూర్, ఆగస్టు 5: ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్ జిల్లా రోహాసీ గ్రామంలో నిర్వహిస్తున్న సెంటర్‌లో ఊపిరాడక 18 ఆవులు మృతి చెందాయి. ఇదే కేంద్రంలో ఉన్న మరో 18 పశువులు కోలుకున్నాయని జిల్లా కలెక్టర్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ గ్రామం నుండి 70 కి.మీ దూరంలోకి రాష్ట్ర రాజధానికి పశువులను తరలించేందుకు ఒక కేంద్రంలో సిద్ధంగా ఉంచారని అధికారులకు సమాచారం అందింది.

08/06/2018 - 01:42

జబల్పూర్ (మధ్యప్రదేశ్)లో ఆదివారం భారత్ బచావ్ ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి
వాటర్ క్యానన్లను ప్రయోగిస్తున్న పోలీసులు.

Pages