S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/11/2016 - 07:03

న్యూఢిల్లీ, జూలై 10: దేశంలోని లక్షా 50 వేల గ్రామాలలో రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో సబ్సిడీ ధరలపై 80వేల వాణిజ్య ప్రజారవాణా వాహనాలను అందజేస్తారు. ‘నేటికీ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రజలు రవాణా సౌకర్యాలు లేక కిలో మీటర్ల కొద్ది నడిచివెళ్తున్నారు.

07/11/2016 - 07:02

న్యూఢిల్లీ, జూలై 10: గుజరాత్‌లో జరిగిన ఇషత్ జహాన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పత్రాల అదృశ్యంపై దర్యాప్తు జరిపిన ఐఎఎస్ అధికారి బి.కె.ప్రసాద్ సర్వీసును రెండు నెలల పాటు పెంచడానికి గల కారణాలను వెల్లడించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిరాకరించింది. ప్రసాద్ ఈ సంవత్సరం మే 31న పదవీ విరమణ చేయవలసి ఉంది. కాని, కేంద్రం ఆయన సర్వీసును జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

07/11/2016 - 07:01

అహ్మదాబాద్, జూలై 10: గత రెండేళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నల్లధనంపై తీసుకున్న చర్యల కారణంగా విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న అక్రమ ఆస్తులు గణనీయంగా తగ్గాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జి-20 దేశాలు తీసుకున్న చర్యలతోపాటుగా సాంకేతిక జోక్యం కారణంగా ఇప్పుడు దేశంలో కానీ, విదేశాల్లో కానీ నల్లధనాన్ని ఉంచుకోవడం కష్టంగా మారుతోందన్నారు.

07/11/2016 - 06:40

న్యూఢిల్లీ, జూలై 10: అఫ్జల్‌గురు ఉరితీతపై దేశద్రోహ నినాదాలు చేసి రాజద్రోహ అభియోగాలను ఎదుర్కొంటున్న జవహర్‌లాల్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్ తాజాగా కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనిని తెగ మెచ్చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు.

07/11/2016 - 06:02

ఢిల్లీ/విజయవాడ/గజ్వేల్, జూలై 10: అమర్‌నాథ్ యాత్రకు తెలుగు రాష్ట్రాలనుంచి వెళ్లిన 350మందికి పైగా యాత్రికులు కాశ్మీర్‌లో చిక్కుబడిపోయారు. కనీస సౌకర్యాలు కరవై అల్లాడుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పశ్చిమ గోదావరి, మెదక్ జిల్లాలకు చెందినవారు వీరిలో ఉన్నారు.

07/11/2016 - 05:52

శ్రీనగర్, జూలై 10: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎన్‌కౌంటర్ కారణంగా కాశ్మీర్‌లో చెలరేగిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఆదివారం ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు, మరో ముగ్గురు యువకులు మృతి చెందారు. కాగా, శనివారం ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు సైతం ఆదివారం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరుకుంది.

07/11/2016 - 01:06

ముంబై, జూలై 10: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వివాదాస్పదమైంది. జలసంరక్షణ, గ్రామీణ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పంకజాముండే నుంచి జలసంరక్షణ శాఖ తొలగించటంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి పంకజ నివాసం దగ్గర ఆమె అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. సీయం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

07/10/2016 - 16:31

శ్రీనగర్:కాశ్మీర్ లోయలోని పది జిల్లాల్లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆదివారం అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. కాశ్మీర్‌లో మాత్రం అల్లర్లు సమసిపోలేదు. ముందుజాగ్రత్త చర్యగా అక్కడ సెల్, ఫోన్, సామాజిక మీడియాను ప్రభుత్వం నిలిపివేసింది.

07/10/2016 - 04:43

బళ్ళారి, జూలై 9: తుంగభద్ర జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు వరద నీరు వచ్చిచేరుతోంది. శనివారం ఎగువ నుంచి 35,097 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నీటిమట్టం 1604.52 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 25.861 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం పెరుగుతున్నందున కాల్వలకు నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

07/10/2016 - 02:27

శ్రీనగర్, జూలై 9: ఒక ఉగ్రవాది ఎదురుకాల్పుల్లో మరణించినందుకు కాశ్మీర్ రావణకాష్టంలా రగులుతోంది. ఐసిస్ జండాలు, పాకిస్తాన్ పతాకాల రెపరెపలు, భారత వ్యతిరేక నినాదాలతో కరడుగట్టిన వేర్పాటువాదులు రెచ్చిపోయారు. ఓవైపు రాళ్ల దాడులు, మరోవైపు బాష్పవాయు గోళాలు.. తూటాలతో కాశ్మీర్ దద్దరిల్లిపోయింది. ఈ ఆందోళనల్లో ఇప్పటికే 11 మంది మరణించారు. 200 మంది క్షతగాత్రులయ్యారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

Pages