అదిలాబాద్

సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 21: సైబర్ నేరాలను అదుపుచేయుటకు దర్యాప్తు సమయంలో జిల్లా పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞాణంను అవలంభించి విజయవంతం కావాలని జిల్లా ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. గురువారం స్థానిక పోలీసు కార్యాలయంలో ఉచిత శిక్షణ కొరకు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు. ఈ సంధర్భంగా 8వేల మంది పురుష అభ్యర్థులు, 800 మంది మహిళలు ఉచిత పోలసు శీక్షణ కొరకు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. జిల్లా దర్యాప్తు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇటీవలే మంచిర్యాల పరిధిలో జరిగిన భారీ చోరిని మూడు రోజుల్లో ఛేదించారని అన్నారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి పూర్తిస్థాయిలో పోలీసులను సిద్ధంగా ఉంచామని అన్నారు. జిల్లాలో దేశిదారు అరికట్టడానికి ప్రణాళికలు సిద్దం చేశామని, డిఎస్పీ అధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందంను ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జిఆర్ రాధిక, టి.పనసారెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పీ ఏ.లక్ష్మినారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ బి.ప్రవీణ్, డిసిఆర్‌డి ఎస్సై రమేష్, ఆర్ ఎస్సైలు ఎన్.కృష్ణ, వి.మధుకర్, ప్రజా ఫిర్యాదుల అధికారులు శివాజి చౌహన్, జైస్వాల్ కవిత, సిసి రవిందర్‌సింగ్ పాల్గొన్నారు.