వరంగల్

హెల్మెట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 21: ప్రతి వాహన చోదకుడు హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని గిరిజన పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదురుగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు 500 మంది హెల్మెట్ ధరించి నిర్వహించిన బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని వారు వాహనాలు నడుపకూడదని, వాహనాలు నడిపేటప్పుడు వాహనచోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి అతివేగంగా నడుపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 30 శాతం మంది టూవిల్లర్లను నడిపే వాహనచోదకులే ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వాహనాలు నడుపకుండా అతి జాగ్రత్తగా నడిపేలా సూచనలు అందజేయాలన్నారు. కారు నడిపేటప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని రెడ్ సిగ్నల్ పడినప్పుడు రోడ్డు దాటకూడదని సిగ్నల్స్ పాటించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు తగ్గించేందుకే రవాణా శాఖతో పాటు పోలీస్ శాఖ మరియు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా పాలుపంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన సంతకాల సేకరణను మంత్రి చందూలాల్ ప్రారంభించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శివలింగయ్య, రూరల్ అడిషనల్ ఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.